Begin typing your search above and press return to search.

కొబ్బ‌రి చెట్ల ప‌చ్చ‌ద‌నంలో హెగ్డే మంట‌లు

By:  Tupaki Desk   |   20 Nov 2021 4:31 PM GMT
కొబ్బ‌రి చెట్ల ప‌చ్చ‌ద‌నంలో హెగ్డే మంట‌లు
X
బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ మూడు చోట్లా న‌టిస్తోంది. ఇక ఖాళీ స‌మ‌యం చిక్కేది చాలా అరుదు. అందువ‌ల్ల ఈ సారి మాల్దీవుల్లో వాలిపోయింది. మాల్దీవుల్లో బీచ్ అందాల్ని ప‌చ్చందాల్ని కూడా ఆస్వాధిస్తూ లైఫ్ లో చిల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా మాల్దీవుల్లోనే పూజా వ‌రుస ఫోటోషూట్ల‌తో ఎక్కువ‌గా గ‌డిపింది. అక్క‌డి అప్ డేట్స్ ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసుకుంటూ ఆ ఫీల్ ని అభిమానుల‌కు అందిస్తోంది. నిన్న‌టి రోజున బికినీ పోటోల్ని షేర్ చేసిన అమ్మ‌డు తాజాగా మరో రేర్ ఫోటోగ్రాఫ్ ని ఇన్ స్టా వేదిక‌గా పంచుకుంది.

ఇది కూడా టూ పీస్ బికినీయే. టాప్ టూ బాట‌మ్ ష‌ర్ట్ తో క‌వ‌రప్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. వెకేష‌న్ మోడ్! అంటూ ఓ అంద‌మైన‌ క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. హెగ్డే హాట్ లుక్ కి మ‌తులు చెడిపోతున్నాయంటూ ఓ నెటిజ‌నుడు కామెంట్ చేసాడు. ఇక పూజా సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో న‌టిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌`లోనూ న‌టిస్తోంది. ఇవే గాక బాలీవుడ్ లోనూ న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం హిందీ-త‌మిళంలో అవ‌కాశాలు ద‌క్కుతుండ‌టంతో టాలీవుడ్ ని కొంత‌ అశ్ర‌ద్ధ చేస్తోంద‌న్న విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తోంది. ఇటీవ‌లే ద‌క్షిణాది చిత్రాల‌కు స‌బంధించి పారితోషికం హైక్ చేసింద‌ని స‌మాచారం. ఒక్కో సినిమాకు మూడు కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ని..అంతేగాక నిర్మ‌త‌ల నెత్తిన అద‌న‌పు భారం వేస్తుంద‌ని నిర్మాత‌లు సూటిగా ఆరోపించే స‌న్నివేశం ఎదురైంది. ప్ర‌స్తుతం పూజా త‌మిళంలో బీస్ట్ అనే చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ చిత్రంలోనూ న‌టించ‌నుంది. ఇదే చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి - మీనాక్షి చౌద‌రి లాంటి యంగ్ బ్యూటీస్ న‌టించ‌నున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.