Begin typing your search above and press return to search.
మరోసారి విజయ్ జోడీ కట్టాలనుంది: పూజ హెగ్డే
By: Tupaki Desk | 8 April 2022 10:00 PM ISTపూజ హెగ్డే కెరియర్ తమిళ సినిమాతోనే మొదలైంది. ఆ తరువాతనే ఆమె తెలుగు తెరవైపు అడుగులు వేసింది. హిందీ వైపు మనసు లాగినప్పటికీ, తెలుగుపైనే దృష్టి పెట్టేసి, చాలా తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. చాలా గ్యాప్ తరువాత ఆమె ఒక స్టార్ హీరోయిన్ గా కోలీవుడ్లో అడుగుపెట్టింది. సన్ పిక్చర్స్ వారు అత్యధిక పారితోషికం చెల్లించి ఆమెను తీసుకున్నారు. నయనతార తరువాత ఆ స్థాయి పారితోషికాన్ని ఈ సినిమా కోసం పూజ అందుకుంది అంటున్నారు.
ఈ నెల 13వ తేదీన 'బీస్ట్' తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదలవుతోంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రెస్ మీట్ కొంతసేపటి క్రితం జరిగింది. ఈ వేదికపై పూజ హెగ్డే మాట్లాడుతూ .. "తమిళ సినిమాతోనే నా జర్నీ స్టార్ట్ అయింది. నాకు ఇంతపెద్ద అవకాశం ఇచ్చినందుకు సన్ పిక్చర్స్ వారికి థ్యాంక్స్ చెబుతున్నాను. 'బీస్ట్' ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ సినిమా. ఇంతకుముందు నెల్సన్ గారు చేసిన 'కోలమావు కోకిల' .. 'డాక్టర్' సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ కి మాత్రమే వాళ్ల కంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అలాంటివారిలో నెల్సన్ ఒకరు.
అందరికీ తెలియని ఒక విషయమేమిటంటే ఆయన ఒక కనిపించని 'బీస్ట్'. అందువల్లనే ఆయనకి డిఫరెంట్ ఐడియాస్ వస్తుంటాయి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ గా అనిపించింది. ఆయనతో కలిసి మళ్లీ పనిచేయాలనుంది. నేను ఎప్పటి నుంచో అనిరుధ్ ఫ్యాన్ ని. ఆయన పాటలను నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నాకు బాగా నచ్చుతుంది. నా హీరో విజయ్ ఈ రోజున ఇక్కడికి రాలేదు .. అందరూ కూడా ఆయనను మిస్సవుతున్నారు.
విజయ్ తో కలిసి పనిచేసిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో షూటింగులో పాల్గొన్న రోజులు ఎంతో సరదాగా .. సందడిగా గడిచిపోయాయి. ఆయనతో కలిసి మళ్లీ నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఆయన స్టార్ హీరో అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఆయనలోని ఆ అంకితభావం అంటే నాకు చాలా ఇష్టం" అంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఆమె అనిరుధ్ తో కలిసి 'హలమితి హబీబో' అనే పాటకి కాలు కదిపింది. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ లో పూజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.