Begin typing your search above and press return to search.
అప్పుడు ఐరన్ లెగ్.. ఇప్పుడు లక్కీ బ్యూటీ..!
By: Tupaki Desk | 11 Oct 2021 6:00 AM IST'మాస్క్' అనే ప్లాప్ సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా పర్వలేదనిపించినా తర్వాత వచ్చిన 'ముకుంద' ప్లాప్ అయింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'మొహెంజదారో' మూవీతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలా మూడు భాషల్లో చేసిన నాలుగు సినిమాలు ఈ భామకు చేదు అనుభవాలే మిగిల్చాయి. దీంతో పూజా మీద 'ఐరన్ లెగ్' అనే ముద్ర పడిపోయింది.
అలాంటి సమయంలో అల్లు అర్జున్ 'డీజే-దువ్వాడ జగన్నాథమ్' చిత్రంతో తనలోని గ్లామర్ కోణాన్ని బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి అమ్మడు వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ'.. మహేష్ బాబు తో 'మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది పూజా. ఇదే జోష్ లో 'హౌస్ ఫుల్ 4' తో తిరిగి బాలీవుడ్ లోఅడుగుపెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. 'అల వైకుంఠపురంలో' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి క్రేజీ హీరోయిన్ గా, మోస్ట్ డిమాండబుల్ బ్యూటీగా మారిపోయింది. స్టార్ హీరోలకు ఏకైక ఛాయిస్ అయింది.
ప్రస్తుతం తెలుగులో నాలుగు - తమిళ్ లో ఒకటి - హిందీలో మూడు సినిమాలతో ఈ బుట్టబొమ్మ బిజీగా గడుపుతోంది. ప్రభాస్ తో కలిసి పూజా నటించిన 'రాధే శ్యామ్' సినిమా 2022 జనవరి 14న విడుదల కాబోతోంది. అఖిల్ అక్కినేనికి జోడీగా చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రామ్ చరణ్ కు జంటగా నటించిన 'ఆచార్య' చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతోంది. మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #SSMB28 ప్రాజెక్ట్ లో పూజాహెగ్డే ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.
అలానే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి పూజా హెగ్డే 'బీస్ట్' అనే సినిమా చేస్తోంది. డెబ్యూ మూవీ 'మాస్క్' తర్వాత ఆమె చేస్తున్న రెండో తమిళ సినిమా ఇది. ఇదే క్రమంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ - డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో 'సర్కస్' అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటుగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ - స్టార్ హీరో అక్షయ్ కుమార్ లతో ఒక్కో సినిమా చేస్తోంది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలను మెదలుకొని కుర్ర హీరోల వరకు అందరితో నటిస్తోంది. ఇక మిగిలింది పవన్ కల్యాణ్ ఒక్కడే అనుకుంటుండగా ఇప్పుడు 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రంలో పూజా నే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ హింట్ ఇచ్చారు. ఏదేమైనా ఒకప్పుడు పూజా హెగ్డే ను ఐరన్ లెగ్ అన్నవాళ్లే ఇప్పుడు లక్కీ చార్మ్ అనే స్థాయికి అమ్మడు చేరిందని చెప్పవచ్చు.