Begin typing your search above and press return to search.

చేప‌లు పీత‌ల రుచి మ‌రిగిన హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   15 Nov 2021 5:00 AM GMT
చేప‌లు పీత‌ల రుచి మ‌రిగిన హాట్ బ్యూటీ
X
ఇటీవ‌ల బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్ - సారా అలీ ఖాన్ వ‌రుసగా మాల్దీవుల విహారంతో మంట‌లు పుట్టించిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌స విహార‌యాత్ర‌ల్లో అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్ తో విరుచుకుప‌డుతున్నారు ఈ భామ‌లు. ఇత‌రుల‌తో పోలిస్తే జాన్వీ- సారా ఎక్కువ‌గా మాల్దీవుల విహారానికి వెళుతున్నారు.

ఇప్ప‌టికి బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేలో రియ‌లైజేష‌న్ క‌నిపిస్తోంది. సాటి నాయిక‌ల‌కు ధీటుగా ఇక తాను కూడా బ‌రిలో దిగేస్తున్నాన‌ని ప్రూవ్ చేస్తూ మాల్దీవుల్లో వాలిపోయింది పూజా. సుదూర తీరంలో ఉన్న‌ స్వ‌ర్గ సీమ‌లో బికినీ విహారంతో చెల‌రేగిపోయింది. రెడ్ హాట్ బికినీలో పూజా అంద‌చందాలు మాల్దీవుల్ని హీటెక్కిస్తున్నాయ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

తాజాగా మ‌రికొన్ని అరుదైన ఫోటోల‌ను పూజా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. పూజా నిన్న సాయంత్రం తన అల్పాహార సెష‌న్స్ కి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. అక్కడ ఒక పూల్ లో జ‌ల‌కాలాడుతూ కనిపించింది. తేలియాడే ట్రే నుండి ఆహారాన్ని అందుకుంటూ పూజా కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో పూజా మునుపెన్నడూ లేనంత కొత్త‌గా హాట్ గా క‌నిపించి మ‌త్తెక్కించింది. ఆస‌క్తిక‌రంగా త‌న ముందు ఉన్న ఫుడ్ ట్రేలో దోర‌దోరగా వేయించిన చేప‌లు స‌ముద్ర వంట‌కాలు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి తాను ప‌క్కాగా నాన్ వెజిటేరియ‌న్ అని పూజా చెప్ప‌క‌నే చెబుతోంది.

ఇంత‌కుముందే బీచ్ ప‌రిస‌రాల్లోని విల్లా నుండి బికినీ డ్యాన్స్ వీడియోను అప్ లోడ్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు ఈ కొత్త ఫోటోలు అంతే వైర‌ల్ గా మారుతున్నాయి. DJ దువ్వాడ జగన్నాథమ్ లో నిమిషం పాటు అలా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ సూట్ లో క‌నిపించి మంటలు పుట్టించిన ఈ బ్యూటీ మాల్దీవుల్లో అంత‌కుమించి హీటెక్కించేస్తోంది. పూజా టోన్డ్ బాడీ ఒంపు సొంపుల రూప‌లావ‌ణ్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.