Begin typing your search above and press return to search.
రాత్రికే రాత్రే సక్సెస్ రాలేదంటున్న బుట్టబొమ్మ..!
By: Tupaki Desk | 22 April 2023 8:52 PM ISTగోపికమ్మా చాలును లేమ్మా ఈ నిదురా.. అంటూ గోపిక వేశంతో అందర్నీ ఆశ్చర్య పరిచి, బుట్టబొమ్మా.. బుట్టబొమ్మ డ్యాన్స్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన పూజా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ అనే తమిళ సినిమాతో 2012లో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ... ఒక లైలా కోసం చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ముకుంద, డీజే, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. తనకు సక్సెస్ ఒక రాత్రిలో వచ్చింది కాదని చెప్పింది.
తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న తొలి రోజుల్లో భాష రాక చాలా ఇబ్బందులు పడ్డట్టు తెలిపింది. ఇప్పుడు సంభాషణలను ముందుగా సహాయ దర్శకులను చెప్పమని ఆ తర్వాత తాను మాట్లాడే ప్రయత్నం చేసినట్లు వివరించింది. ఇటీవల కాలంలో తాను నటించిన ఏ చిత్రాలు సరిగ్గా ఆడట్లేదని.. అందువల్లే తనకు అవకాశాలు రాక ఒక ఏడాది కాలం తాను ఇంట్లోనే కూర్చున్నానని పేర్కొంది.
ప్రస్తుతం అనూహ్యంగా తనకు కొత్త కొత్త సినిమాలు, ప్రాజెక్టుల్లో అవకాశం రావడంతో బిజీగా మారినట్లు చెప్పింది. ఇప్పుడు నటిగా తాను మంచి స్థాయిలో ఉన్నానని.. కానీ ఆరంభ కాలంలో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది. తనకు డ్రీమ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయని ముఖ్యంగా మహిళ్లలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పూజా హెగ్డే పేర్కొంది.
ఒకప్పుడు పూజా ఒక్కో సినిమాకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకునేది. కానీ వరుస ప్లాపులు వస్తుండడంతో ఆమె రెమ్యనరేషన్ తగ్గిందని చాలా మంది అనుకున్నారు. ఇటీవలే మళ్లీ వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. మహేష్ బాబుతో ఆయన 28వ సినిమాలో నటిస్తోంది. అలాగే నిన్ననే రిలీజ్ అయిన కిసీ కా భాయి కిసీ కా జాన్ చిత్రంలోనూ నటించింది.