Begin typing your search above and press return to search.

మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌ల‌పై పూజా ఎమోషన్

By:  Tupaki Desk   |   9 Aug 2021 4:44 AM GMT
మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌ల‌పై పూజా ఎమోషన్
X
టాలీవుడ్ స్టార్ల‌లో పవ‌న్ క‌ల్యాణ్ .. నాగార్జున‌..వెంక‌టేష్‌.. సాయిధ‌ర‌మ్.. ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి.. పూరి జ‌గన్నాథ్ లాంటి వాళ్లు క్రీడ‌ల ప‌ట్ల ఎంతో శ్ర‌ద్ధ‌గా ప‌రిశీల‌న‌తో ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. క‌థానాయిక‌ల్లో స‌మంత .. పూజా హెగ్డే.. ల‌క్ష్మీ మంచు వంటి వారు అంతే యాక్టివ్ గా ఉంటారు. ప్ర‌స్తుతం టోక్యో ఒలింపిక్స్ పై నిరంత‌ర ట్వీట్లు చాట్ ల‌తో వీరంతా సోషల్ మీడియాల్లో విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు హోరెత్తిస్తున్నారు.

తాజాగా పూజా హెగ్డే కూడా గోల్డ్ మెడ‌ల్ ఒలింపియ‌న్ నీర‌జ్ చోప్రా విష‌యంలో ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. భార‌త మువ్వ‌న్నెల జెండా టోక్యోలో ఎగురుతోంద‌ని భార‌తీయులు స‌గ‌ర్వంగా త‌లెత్తుకు తిర‌గొచ్చ‌ని పూజా ఎమోష‌న‌ల్ అయ్యారు. నిజానికి క‌థానాయిక‌ల్లో చాలా మందికి క్రీడ‌లంటే ఆస‌క్తి ఉన్నా ఇలా బ‌హిరంగ వేదిక‌ల‌పై ప్ర‌త్యేకంగా త‌మ వ్యూని చెప్పేది త‌క్కువే. బాలీవుడ్ లో బిజీగా ఉన్న తాప్సీ కూడా స్పోర్ట్స్ విష‌యంలో ఎంతో ఆస‌క్తిగా ఉంటారు.

ఇక పూజా నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో..టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. పూజా హైట్ కు కాంట్రాస్ట్ గా పొట్టి గౌనులు వేసుకున్నా.. లేదా బికినీల‌తో వేడెక్కించినా.. ఆ అందానికి యూత్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా వైట్ అండ్ వైట్ గౌనులో పూజా అంద‌చందాల ట్రీట్ జిగేల్ మనిపించింది. నెత్తికి టోపీ సైతం వేసుకుని హాట్ అండ్ క్యూట్ లుక్ తో క‌ట్టిప‌డేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో పూజా హెగ్దే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కోట్లాది మంది ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉంది. ఇన్ స్టా లో ఎలాంటి ఫోటో షేర్ చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోషూట్ల‌ పై ప‌డే కామెంట్లు హీటెక్కిస్తుంటాయి. పూజా హెగ్దే న‌ట‌వృత్తి విష‌యానికి `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాతో బుట్ట‌బొమ్మ‌గా చ‌క్క‌ని గుర్తింపు తెచ్చుకుంది.

ప్ర‌స్తుతం పూజా మూడు భాష‌ల్లో బిజీగా ఉంది. తెలుగు, ..త‌మిళ్,.. హిందీ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. అఖిల్ స‌ర‌స‌న న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా సినిమా `రాధేశ్యామ్` లో న‌టిస్తోంది. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `ఆచార్య‌`లో నీలాంబ‌రి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇక కోలీవుడ్ ...బాలీవుడ్ లో రెండేసి సినిమాలు చేస్తోంది.