Begin typing your search above and press return to search.

గాలి ఆస్వాద‌న‌కే పూజాబ్యూటీ అందాల‌న్ని!

By:  Tupaki Desk   |   18 Feb 2022 8:30 AM GMT
గాలి ఆస్వాద‌న‌కే పూజాబ్యూటీ అందాల‌న్ని!
X
బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే ఫ్యాష‌న్ ఐకానిక్ గాళ్ల్ గా సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు వెలిగిపోతుంది. ఆల్ర్టా మోడ్ర‌న్ లుక్ లో స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. కొత్త కొత్త డిజైన‌ర్ దుస్తుల్లో బుట్ట‌బొమ్మ ఇట్టే ఒదిగిపోతుంది. అందానికి అందం..అవ‌స‌రం మేర బోల్డ్ ట‌చ్ అప్ తో యువ‌త‌ని ఆక‌ట్టుకోవ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. ఇక బీచ్ రిసార్స్ట్ లో బికినీ..టూపీస్ ల్లో పూజా బ్యూటీ ఎలివేష‌న్స్ గురించి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు.

అమ్మ‌డు మాల్దీవుల ట్రిప్ వేసిందంటూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ కి పండ‌గే. డ‌బుల్..ట్రిపుల్ ట్రీట్ తో కుర్ర‌కారు హృద‌యాల్ని దోచేస్తుంది. తాజాగా న‌డి స‌ముద్రంలో బోటులో విహార యాత్ర చేస్తున్న ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ల‌గ్జ‌రీయిస్ బోట్ లో అలా సాయంత్రం వేళ స‌ముద్రయానం చేస్తూ సేద‌ తీరుతోంది. ఇందులో బ్యూటీ చార‌ల దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది.

టాప్ లో బికినీ టైపు షోల్డ‌ర్ మొత్తం క‌వ‌ర్ చేసిన‌ బ్లౌజ్ ధ‌రించి బాట‌మ్ లో మ్యాచింగ్ ధ‌రించింది. స‌ముద్రం గాలికి ఎగురుతోన్న ఆకురుల అందాల న‌డుమ అస‌లైన‌ అందాన్ని దాచేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పూజాహెగ్డే అభిమాన‌లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేసి సంబ‌ర‌ప‌డుతున్నారు.

ఇక పూజాహెగ్డే సినిమాల లైనప్ విష‌యానికి వ‌స్తే మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఆచార్య‌`లో ..పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో న‌టిస్తోంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తుంది.

ఈ రెండు చిత్రాలు అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ఈ రెండు కూడా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. అలాగే కోలీవుడ్ లో విజ‌య్ స‌ర‌స‌న బీస్ట్ లో న‌టిస్తోంది. ఇక‌ బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న `సిర్క‌స్` లో న‌టిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇంకా మ‌రో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసిన‌ట్లు స‌మాచారం.