Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఎయిర్‌ పోర్ట్‌ లో పూజా రచ్చ

By:  Tupaki Desk   |   14 Sept 2020 5:00 PM IST
ఫొటోటాక్‌ : ఎయిర్‌ పోర్ట్‌ లో పూజా రచ్చ
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం పూజా హెగ్డే హవా కొనసాగుతోంది. ఈమె ఒక వైపు ప్రభాస్‌ తో 'రాధేశ్యామ్‌' సినిమాతో పాటు అఖిల్‌ తో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాల షూటింగ్‌ కరోనా కారణంగా గత ఆరు ఏడు నెలలుగా ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని రీ షెడ్యూల్‌ చేస్తున్నారు. షూటింగ్‌ కు రెడీ అవుతున్న సినిమాల షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యేందుకు పూజా హెగ్డే మునుపటిలా మళ్లీ బిజీ అవుతోంది. ఇటీవల షూటింగ్‌ నిమిత్తం మరోసారి విమానయానం చేసింది. ఈ సందర్బంగా ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

వైట్‌ టీ షర్ట్‌ మరియు జీన్స్‌ మినీ ష్కర్ట్‌ తో తన థైస్‌ ను చూపిస్తూ ఎయిర్‌ పోర్ట్‌ లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే అంతా కూడా ఒక నిమిషం ఆమె వైపు అలా చూస్తూ ఉండి పోయారు. చేతిలో ఒక బుక్‌ మరియు ట్యాబ్‌ తో పాటు మాస్క్‌ లో ఉన్న ఆమెను అలా చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్‌ లో ఉన్నట్లుగా అనిపించింది. సినిమా కోసం రెడీ అయినంత సెక్సీగా రెడీ అవ్వడంతో పాటు చాలా స్టైలిష్‌ లుక్‌ తో ఎయిర్‌ పోర్ట్‌ లో క్యాట్‌ వాక్‌ చేస్తున్న ఆమెను చూసి అంతా కూడా వావ్‌ అంటూ తమ మొబైల్స్‌ కు పని చెప్పారు. అక్కడ ఉండే ఫొటోగ్రాఫర్లకు పూజా చిన్నగా స్మైల్‌ ఇస్తూ అక్కడ నుండి వెళ్లింది.