Begin typing your search above and press return to search.

అలా కొంటెగా క‌వ్వించ‌కు ఓ బుట్ట‌బొమ్మా

By:  Tupaki Desk   |   18 Dec 2022 8:27 AM IST
అలా కొంటెగా క‌వ్వించ‌కు ఓ బుట్ట‌బొమ్మా
X
పొడుగు కాళ్ల అందంతో క‌వ్వించిన పూజా హెగ్డే సొగ‌సును ఎంతో అందంగా పొగిడేశారు ఓ సీనియ‌ర్ లిరిసిస్ట్. నాటి నుంచి ఈ బ్యూటీ ఎక్క‌డికి వెళ్లినా బుట్ట బొమ్మా అంటూ ప్రేమ‌గా పిలుచుకుంటున్నారు అభిమానులు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ త‌న‌కు ఇంత‌టి ఇమేజ్ ని ఇచ్చిన తెలుగు చిత్ర‌సీమ‌ను విడిచిపెట్ట‌కుండా ఇక్క‌డ న‌టిస్తూనే బాలీవుడ్ కోలీవుడ్ లోను చ‌క్క‌బెడుతోంది. కోలీవుడ్ అంత‌గా క‌లిసి రాక‌పోయినా ఇప్పుడు స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న న‌టిస్తూ హిందీ చిత్ర‌సీమ‌పై భారీ హోప్స్ పెట్టుకుంది.

ఈ ఏడాది రాధేశ్యామ్ -బీస్ట్ లాంటి డిజాస్ట‌ర్ సినిమాలు సౌత్ లో పూజాకు ఊహించ‌ని జోల్ట్. ప్ర‌స్తుతం స‌ల్మాన్ భాయ్ తో కిసీ కా బాయ్ కిసీకా జాన్ 2023 బిగ్గెస్ట్ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలుస్తుంద‌ని పూజా భావిస్తోంది. డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ భాయ్ తో సెల‌బ్రేష‌న్స్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఆరోజు పూజా తో స‌ల్మాన్ రొమాంటిక్ గ్లింప్స్ విడుద‌ల కానుంద‌ని తెలిసింది.

మ‌రోవైపు పూజా వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది. తాజాగా పూజా మ‌రోసారి అగ్గి రాజేసే హాటెస్ట్ లుక్ తో వెబ్ లో హీట్ పెంచింది. పిక్క‌ల పైకి నిక్క‌రు వేసి ఆ పొడుగు కాళ్ల సొగ‌సును ఎంతో అందంగా ఆవిష్క‌రించింది. కాంబినేష‌న్ డిజైన‌ర్ టాప్ పైన కోట్ తో గుండెల్లో గుబులు పుట్టించింది.

పూజా నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ఇది. ఈ లుక్ చూశాక త్రివిక్ర‌మ్ బుట్ట‌బొమ్మ టైటిల్ తో మ‌ళ్లీ సినిమా తీసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అల వైకుంఠ‌పుర‌ములో సీక్వెల్ కథ‌ను కూడా రెడీ చేస్తాన‌ని అప్ప‌ట్లో త్రివిక్ర‌మ్ అన్నారు. కానీ దానికి క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం పూజా ఫోటోషూట్లు మాయావి కంట ప‌డితే క‌చ్ఛితంగా `బుట్ట బొమ్మ` టైటిల్ తోనే సీక్వెల్ అంటాడేమో!! ఓవైపు మ‌హేష్ తో త్రివిక్ర‌మ్ సినిమాకి పూజానే లాక్ చేశాడు కాబ‌ట్టి మునుముందు ఈ కాంబినేష‌న్ లో ఏదైనా లేడీ బాండ్ సినిమాని కూడా ఊహించ‌వ‌చ్చు.