Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ ఫ్లాపుల‌తో అల‌సిపోయింది పాపం!

By:  Tupaki Desk   |   1 May 2022 9:00 PM IST
హ్యాట్రిక్ ఫ్లాపుల‌తో అల‌సిపోయింది పాపం!
X
గోల్డెన్ లెగ్ పూజా హెగ్డే ఐర‌న్ లెగ్ గా మారుతోందా? ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ ఇది. గ‌త‌ ఏడాది వరుస హిట్ లను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సీన్ ఇంత‌లోనే మారిపోయింది. 2022 పూజాకి అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. ఓసారి వివ‌రాల్లోకి వెళితే...

టాలీవుడ్ లో ల‌క్కీ ఛామ్ గా వెలిగిపోతున్న పూజా హెగ్డే కొన్ని వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. అరవింద సమేత వీర రాఘవ -మహర్షి-అల వైకుంఠపురములో-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి హిట్ చిత్రాల్లో న‌టించింది. వరుస ఫ్లాపులకు ముందు పూజా హెగ్డేకి ఇవి బిగ్ బూస్ట్ ఇచ్చాయి.

కానీ ఇంత‌లోనే పూజ సీన్ అకస్మాత్తుగా రివ‌ర్స‌య్యింది. మార్చిలో `రాధే శ్యామ్` ... ఏప్రిల్‌లో `బీస్ట్` .. `ఆచార్య` `అట్టర్ ఫ్లాప్`లుగా నిలిచాయి. ఇది ఊహించ‌నిది. కేవ‌లం మూడు నెలల లోపు మూడు ఫ్లాపులు ఎదుర‌య్యాయి. అయితే దీనినుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న‌వి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంకటేష్- వరుణ్ తేజ్- తమన్నా- మెహ్రీన్ వంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న `ఎఫ్ 3`లో పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో కనిపించనుంది. అనీల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB28` చిత్రంలో నటించనుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవధీయుడు భగత్ సింగ్`లో కూడా కనిపించనుంది. ఈ రెండు సినిమాల‌పైనే పూజా హోప్స్ అన్నీ.

సోష‌ల్ మీడియా క్వీన్ గా..!

మ‌రోవైపు పూజా హెగ్డే సోష‌ల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతోంది. నిరంత‌రం వ‌రుస ఫోటోషూట్ల‌తో పూజా హీటెక్కిస్తోంది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో అద్భుతమైన ఫోటోతో అభిమానులకు స్పెష‌ల్ ట్రీటిచ్చింది. పూజా హెగ్డే బెడ్ పై పడుకున్న ఓ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ``బెడ్ లో నమస్తే!`` అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. కొంచెం అలసిపోయినా కానీ డ్రీమ్ గాళ్ నే త‌ల‌పిస్తోంది అంటూ అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు.

కొందరు కొంటె అభిమానులు త‌న‌కు కంపెనీ ఇవ్వడానికి సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించడం కనిపించింది. పూజా హెగ్డే ఇటీవల విడుదలైన ఆచార్య చిత్రం ప్రమోషన్స్ అనంత‌రం ముంబైలో త‌న ఇంటికి చేరుకుంది. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. త‌దుప‌రి సల్మాన్ స‌ర‌స‌న `కభీ ఈద్ కబీ దీపావళి` సెట్స్‌లో చేరనుంది. అజిత్ వీరమ్‌కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.