Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో బుట్ట‌బొమ్మ అన్ లిమిటెడ్ ట్రీట్

By:  Tupaki Desk   |   17 Nov 2021 9:04 PM IST
మాల్దీవుల్లో బుట్ట‌బొమ్మ అన్ లిమిటెడ్ ట్రీట్
X
బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే మాల్దీవుల విహారం హీటెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్పాట్ నుంచి వ‌ర‌స బికినీ ఫోటోల‌ను షేర్ చేస్తూ పూజా గుబులు రేపుతోంది. ఇంకా త‌ను మాల్దీవులలోనే ఉంది. తాజాగా మ‌రో కొత్త ఫోటోని పూజా షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఇదిగో ఇలా సూర్యుని ఎండ‌లో టోన్డ్ బాడీకి విట‌మిన్ -డిని పంప్ చేస్తోంది. అంతేకాదు.. యూనిక్ లుక్ లో చెట్లతో ఉన్న‌ లేన్ పై నిలబడి ఈ సూర్యుని కిస్డ్ స్నాప్ షాట్ లలో అద్భుతంగా కనిపిస్తోంది. పూజా స్ట‌న్నింగ్ పోజర్ గా నిరూపిస్తోంది.

తాజాగా షేర్ చేసిన ఫోటోల‌కు ``బ్రేవ్ ఫ్రీ & యాజ్ వైల్డ్ యాజ్ ది సీ`` అనే ట్యాగ్ ని ఇచ్చింది. పూజా జిప్సీ సోల్.. సూర్యాస్తమయం.. అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా జోడించింది. మాల్దీవుల్లో పూజా హెగ్డే అన్ కాంప్ర‌మైజ్డ్ గా ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల అల్పాహారం నుండి కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో ఇంత‌కుముందు పంచుకున్న సంగ‌తి తెలిసిందే. ``ఒక సాధారణ అమ్మాయి అసాధారణ అనుభవాల కోసం వెతుకుతోంది`` అంటూ క్యాప్షన్ ని ఇచ్చింది. ఆమె తన అల్పాహారాన్ని తేలియాడే బుట్టలో అందుకుంది. ఇది ఒక ప్లెజెంట్ బ్యూటిఫుల్ అనుభవం అనడంలో సందేహం లేదు. ద్వీప దేశంలో ఆమె విందు సమయానికి సంబంధించిన ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. ఈ రాత్రి డిన్నర్ కోసం మూడ్ సెట్ చేసాం అంటూ దానికి వ్యాఖ్య‌ను జోడించింది పూజా.

పూజా హెగ్డే 2012లో తమిళ చిత్రం ముగమూడితో తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ తర్వాత అశుతోష్ గోవారికర్ మొహెంజో దారోతో బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఇందులో ఆమె హృతిక్ రోషన్ తో కలిసి నటించింది. ఆమె అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ దువ్వాడ జగన్నాధంలో న‌టించింది. త‌ర్వాత‌ హౌస్‌ఫుల్ 4- సాక్ష్యం- మహర్షి -అల వైకుంఠపురములో వంటి చిత్రాలలో న‌టించింది. తాజా చిత్రం అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చ‌క్క‌ని విజ‌యం అందుకుంది. పూజా హెగ్డే తదుపరి ప్రభాస్‌తో రాధే శ్యామ్ లో.. రణవీర్ సింగ్ తో సర్కస్ లో.. చిరంజీవి-చ‌ర‌ణ్ ల‌ ఆచార్యలో క‌నిపించ‌నుంది. బీస్ట్ లో విజయ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. రాధే శ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.