Begin typing your search above and press return to search.
#బుట్ట బొమ్మ.. విమానాశ్రయాల్లో కంటికి కునుకు కరువేనా?
By: Tupaki Desk | 30 Sept 2021 8:00 AM ISTమూడు పరిశ్రమల్లో మూడుముక్కలాట ఆడడంలో తనని కొట్టేవాళ్లే లేరని నిరూపిస్తోంది పూజా హెగ్డే. ఓవైపు టాలీవుడ్ లో అరడజను క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పూజా అటు హిందీ- తమిళంలోనూ వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది.
ప్రస్తుతం విజయ్ సరసన బీస్ట్ అనే భారీ తమిళ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. దీనికోసం ముంబై టు చెన్నయ్ ప్రయాణాలు చేస్తోంది. తాజాగా పూజా షేర్ చేసిన ఫోటో ని చూడగానే పూజా ఈ ఫోజు ఎక్కడి నుంచి అంటూ అభిమానులు ప్రశ్నలు సంధించారు.
తాజా సమాచారం మేరకు.. పూస్ట్ హెగ్డే ఆమె బృందం బీస్ట్ తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందు కంటే ముందే చెన్నై(సెప్టెంబర్ 28 న)లో అడుగుపెట్టారు. నేడు నగరంలో జరిగే షూటింగులో దళపతి విజయ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ లను కలిసింది. విమానాశ్రయం నుండి తన ఫోటోను ఇన్ స్టాలో పూజా షేర్ చేసింది. ఆమె ఎయిర్ పోర్టు లుక్ ఎంతో ట్రెండీగా ఆకట్టుకుంది. ఆవపిండి ఓవర్ కోట్ ఫేస్ మాస్క్ తో నల్లటి దుస్తుల్లో కనిపించింది. బాటమ్ లో కాంబినేషన్ బూట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రభాస్‌తో పూజా సంబంధాలు సరిగా లేవని వార్తలు వైరల్ అయిన తర్వాత పూజా ఇలా ప్రత్యక్షమైంది ఎయిర్ పోర్ట్ లో. రాధే శ్యామ్ సెట్స్‌లో పూజా వృత్తిగత ప్రవర్తనతో ప్రభాస్ కలత చెందారని పుకారు వచ్చింది. అయితే రాధే శ్యామ్ మేకర్స్ పుకార్లను తోసిపుచ్చారు. ప్రభాస్ - పూజాల మధ్య అంతా బాగానే ఉందని ప్రకటించారు.
ఇప్పుడు మంగళవారం నుంచి తన తదుపరి చిత్రం `బీస్ట్` షూటింగ్ కోసం చెన్నైకి తిరిగి వచ్చినట్లు పూజా వెల్లడించింది. విమానాశ్రయం నుండి ఫోటోను పంచుకుంటూ.. పూజా.. సినిమాలు చేయడానికి సమయం వచ్చింది #చెన్నై సైనికులు (sic) అంటూ కోట్ చేస్తూ వ్యాఖ్యను జోడించింది. తాజా సమాచారం మేరకు.. మేకర్స్ చెన్నైలో ఒక చిన్న షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. నవంబర్ నెలాఖరులోగా మొత్తం చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం 2022 వేసవిలో థియేటర్లలోకి రానుంది. డైరెక్టర్ సెల్వరాఘవన్- షైన్ టామ్ చాకో- యోగి బాబు- VTV గణేష్ -అపర్ణ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస- ఎడిటర్ ఆర్. నిర్మల్ - స్వరకర్త అనిరుధ్ రవిచందర్ సాంకేతిక సిబ్బందిలో ఉన్నారు. బీస్ట్ మేకర్స్ రానున్న నెలల్లో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.