Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బుట్ట బొమ్మ పైన పటారం లోన లొటారం
By: Tupaki Desk | 27 Sept 2021 9:00 AM ISTముంబై బ్యూటీ పూజాహెగ్డే ప్రోఫెషనల్ కెరీర్ జెట్ స్పీడ్ తో సాగిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు..తమిళ్..హిందీ భాషల్లో భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. `అలవైకుంఠపురములో` సక్సెస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ సక్సెస్ పాన్ ఇండియా స్థాయిలోనే అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఆ సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో వెంట వెంటనే మూడునాలుగు ప్రాజెక్ట్ లను కమిట్ అయింది. అటుపై కోలీవుడ్ లో `బీస్ట్` చిత్రంతో విజయ్ సరసన ఛాన్స్ అందుకుంది. ఇక బాలీవుడ్ లోనూ `సిర్కస్` చిత్రంలో అవకాశం వచ్చింది. ఒక్క సక్సెస్ తో మూడు భాషల్లో బిజీ అయిన ఏకైక నటి కూడా పూజా కావడం విశేషం.
పూజా నటనా కెరీర్ అలా హ్యాపీగా సాగిపోతోంది. ఈ క్రేజ్ తో భారీగా పారితోషికంగా అందుకుంటోంది. ఒక్కో సినిమాకు తను తీసుకుంటోన్న పారితోషికంతో పాటు నిర్మాతలకు అదనంగా భారం మోపుతుందనే ఆరోపణలు ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం పూజా హెగ్డే ముంబైలో ఉంది. ముంబైలో పనిమీద బయటకు వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్లేందుకు కార్ వద్దకు వెళ్లింది. ఆ వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీనిని బట్టి పూజా ముంబలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో పూజా లుక్ పై యూత్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అలా పొడవాటి సాధారణ టీషర్ట్ లో కనిపించింది. మ్యాచింగ్ గా మాస్క్ ని ధరించింది. అయితే బుట్టబొమ్మ సడెన్ గా బాటమ్ మర్చిందా? అంటూ యూత్ కి డౌట్లు పుట్టుకొచ్చాయ్.
ఇక తెలుగులో పూజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న`ఆచార్య` చిత్రంలో నీలాంబరి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన `బ్యాచ్ లర్` చిత్రంలో నటిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. కరోనా అడ్డంకితో ఇన్నాళ్లు వాయిదా పడింది. చివరిగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. మరోవైపు విజయ్ బీస్ట్ లోనూ పూజా కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ లో వరుస చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి.