Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బుట్టబొమ్మ వీపందం చూడతరమా?
By: Tupaki Desk | 5 Sept 2021 1:00 PM ISTముంబై బ్యూటీ పూజాహెగ్డే మూడుముక్కలాట నైపుణ్యం తెలిసిందే. టాలీవుడ్ - కోలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ హిందీ పరిశ్రమను విడిచిపెట్టడం లేదు. తనకు అమాంతం పెరిగిన డిమాండ్ దృష్ట్యా పారితోషికంలో కొండెక్కి కూచుకుందన్న టాక్ ఎక్కువగానే వినిపిస్తోంది. ఇటీవల తన యాటిట్యూడ్ విషయంలోనూ విమర్శలు అదే స్థాయిలో ఎదుర్కొంటోంది. పూజాతో సినిమా అంటే నిర్మాతలకు తడిపి మోపుడవుతుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారమవుతోంది.
మూడు కోట్లు పారితోషికంతో పాటు..నలుగురు పర్సనల్ బాడీ గార్డులు... కోసం ఒక చార్టెడ్ ప్లైట్ అన్ని ఏర్పాటు చేస్తేనే సెట్స్ కు వస్తుందని కథనాలొచ్చాయి. తమిళ ఫెడరేషన్ తరపున ఆర్కె.సెల్వమణి ఈ బ్యూటీపై సంచలన ఆరోపణలు చేసారు. దాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు నిర్మాత నట్టి కుమార్ కూడా పూజాపై నిప్పులు చెరిగారు. సినిమాకి పనిచేసిన కార్మికులకు డబ్బులు సరిగ్గా ఇవ్వరు..హీరోయిన్ కి మాత్రం ఇన్ని రకాల సౌకర్యాలా? ఇదెక్కడి న్యాయం? అంటూ మండిపడ్డారు.
ఇలా పూజా రెండుచోట్ల తీవ్ర విమర్శల్ని ఎదుర్కుంటోంది. అయితే అమ్మడు వీటిని ఎంత మాత్రం పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ సరసన `బీస్ట్ `లో నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా నిన్నటి నుంచి నాల్గవ షెడ్యూల్ చెన్నైలో ఓ ప్రయివేట్ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ శనివారం నుంచి పూజా హెగ్డే కూడా సెట్స్ లో జాయిన్ అవుతున్నట్లు ఇన్ స్టా వేదికగా తెలిపింది.
అలాగే సినిమా వివరాల్ని అభిమానులు అడిగినా అమ్మడు చెప్పలేదు. షూటింగ్ మాత్రం బాగా జరుగుతుంద ని..అభిమానులం దరికీ నచ్చే సినిమా అని చెప్పి స్కిప్ అయింది. ఈ షెడ్యూల్ లో సన్నివేశాలతో పాటు పూజ-విజయ్ పై ఓ స్టైలిష్ సాంగ్ కూడా చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో పూజపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తవుంది. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రపీ అందిస్తుండగా..సన్ పిక్చర్స్ భార బడ్జెట్ తో నిర్మిస్తుంది.
మరోవైపు పూజాకి సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. లక్షలాదిగా ఉన్న ఫాలోవర్స్ కోసం పూజా నిరంతర ఫోటోషూట్లు వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా షిమ్మరీ గౌనులో కిల్లర్ లుక్ ని షేర్ చేయగా వైరల్ గా మారింది. మెరుపులు మిరిమిట్ల గౌనులో పూజా వీపందంపై కుర్రాళ్ల కామెంట్లు జోరుగా పడిపోతున్నాయ్.
బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో ఖుషీగా:
పూజా మరోవైపు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ల నేపథ్యంలో తాను నటించిన సినిమాలకు ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తోంది. తాజా చాటింగ్ లో పూజా ప్రభాస్ -మహేష్ ప్రాజెక్టుల గురించి చెప్పిన సంగతులు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ తో రాధే శ్యామ్ సంక్రాంతి 2022 కానుకగా రానుంది. ఈ మూవీ గురించి చాలా సంతోషకర విషయాల్ని పూజా పంచుకుంది. తాజా జన్మాష్టమి పోస్టర్ వైరల్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. తనకు ఆచార్యలో ఒక పాట మిగిలి ఉందని ధృవీకరిస్తూ మెగాస్టార్ చిత్రంలో పనిచేయడంతో తన కల నిజమైందని అయితే విడుదల తేదీకి సంబంధించిన ప్రశ్నలను నిర్మాణ సంస్థను అడగాలని అభిమానులను కోరింది. మరో తెలుగు చిత్రం అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` లో తన కామెడీ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుందని ఆమె చెప్పింది.
మహర్షి తర్వాత రెండోసారి మహేష్ - త్రివిక్రమ్ సర్ తో కలిసి పని చేస్తున్నానని ఇది తనకు సంతోషాన్నిస్తోందని పూజా తెలిపింది. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందట. చిత్రీకరణల గురించి విడుదల తేదీల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నిర్మాణ సంస్థల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెతకాలి అభిమానులను కోరిన ఆమె సినిమా గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీపావళికి ఇప్పుడు భాయి జాన్ అని పేరు మార్చారు. ఇందులో తన పాత్ర ఆకట్టుకుంటుందని పూజా తెలిపింది.