Begin typing your search above and press return to search.

సెల్ఫీ భంగిమ‌లో పూజా అన్ లిమిటెడ్ ట్రీట్

By:  Tupaki Desk   |   3 Sept 2021 7:00 AM IST
సెల్ఫీ భంగిమ‌లో పూజా అన్ లిమిటెడ్ ట్రీట్
X
నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్స్ తో సోష‌ల్ మీడియా అభిమానుల‌కు అదిరిపోయే ట్రీటిస్తున్న పూజా హెగ్డే తాజాగా ట్రెండీ ఫోటోషూట్ తో మ‌రోసారి గుబులు పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా జిమ్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. హ్యాష్ క‌ల‌ర్ టైట్ క‌ర్వీ ట్రాక్.. టాప్ తో పూజా దుమారం రేపుతోంది. ఇక ఇందులో సెల్ఫీ భంగిమ సంథింగ్ స్పెష‌ల్ గా దూసుకెళుతోంది.

ఇంత‌కుముందు పూజ హెగ్డే త‌న‌ సిబ్బంది బంధువుల మెయింటెనెన్స్ విష‌యంలో ఎక్కువ పారితోషికం చెల్లించినందుకు దర్శకుడు త్రివిక్రమ్ పై ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ అది అంత‌ర్జాలంలో ర‌చ్చ చేయ‌డంతో ఆ త‌ర్వాత అభిమానుల దృష్టిని మ‌ర‌ల్చేందుకు వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ముందుకొస్తోంది.

తాజా చాటింగ్ లో పూజా ప్ర‌భాస్ -మ‌హేష్ ప్రాజెక్టుల‌ గురించి చెప్పిన సంగ‌తులు హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌భాస్ రాధే శ్యామ్ గురించి చాలా సంతోషక‌ర విష‌యాల్ని పూజా పంచుకుంది. తాజా జన్మాష్టమి పోస్టర్ వైర‌ల్ గా అంద‌రి దృష్టిని ఆకర్షించింది. తనకు ఆచార్యలో ఒక పాట మిగిలి ఉందని ధృవీకరిస్తూ మెగాస్టార్ చిత్రంలో పనిచేయడంతో తన కల నిజమైందని అయితే విడుదల తేదీకి సంబంధించిన ప్రశ్నలను నిర్మాణ సంస్థను అడ‌గాల‌ని అభిమానులను కోరింది. మరో తెలుగు చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో త‌న కామెడీ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుందని ఆమె చెప్పింది.

మహర్షి తర్వాత రెండోసారి మహేష్ - త్రివిక్రమ్ సర్ తో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని ఇది తనకు సంతోషాన్నిస్తోంద‌ని పూజా తెలిపింది. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. చిత్రీక‌ర‌ణ‌ల గురించి విడుదల తేదీల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నిర్మాణ సంస్థల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెత‌కాలి అభిమానులను కోరిన ఆమె సినిమా గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. తమిళ చిత్రం విజయ్ బీస్ట్ ఆస‌క్తిని పెంచుతోంది. స‌ల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీపావళికి ఇప్పుడు భాయ్‌జాన్ అని పేరు మార్చారు. ఇందులో పూజా పాత్ర ఆక‌ట్టుకుంటుంద‌ట‌.