Begin typing your search above and press return to search.
అలా ప్లెజెంట్ గా నవల చదువుతూ కవ్విస్తోంది
By: Tupaki Desk | 9 Aug 2021 5:00 AM ISTసోషల్ మీడియాల్లో నిరంతర పోస్టింగులతో అభిమానులకు టచ్ లో ఉంటోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. వ్యక్తిగత వృత్తిగత విషయాలను ట్విట్టర్ ఇన్ స్టా వేదికగా అభిమానులకు చేరవేస్తోంది. తాజాగా వైట్ అండ్ వైట్ లుక్ లో సంథింగ్ స్పెషల్ ఫోటోషూట్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది. పూజా మునుపటి కంటే హాట్ అండ్ గ్లామరస్ లుక్ తో స్పెల్ బౌండ్ చేసిందనే చెప్పాలి. అలా ప్లెజెంట్ గా నవల చదువుతూ కవ్విస్తున్న తీరు మైమరిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ఫోటోషూట్లు ర్యాంప్ షోలు ఒకవైపు.. సినిమాలతో మరోవైపు పూజా బిజీ బిజీ. ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం `బీస్ట్`లో పూజా కథానాయికగా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ బీస్ట్ తారాగణంలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ ను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో పూజ తమిళంలోకి అడుగుపెట్టనుంది.
తారాగణం సిబ్బంది అవసరమైన అన్ని కోవిడ్ -19 జాగ్రత్తలతో చెన్నైలో షూటింగ్ చేస్తున్నారు. విజయ్ 47 వ పుట్టినరోజు కానుకగా మేకర్స్ బీస్ట్ మొదటి ..రెండవ లుక్ పోస్టర్ లను ఆవిష్కరించగా ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చింది.
మలయాళ నటి అపర్ణ దాస్.. షైన్ టామ్ చాకో .. యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. బీస్ట్ అసాధారణమైన కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది.