Begin typing your search above and press return to search.

అలలైనా త‌ల వొంచి స‌లాం కొట్టాలి నీకు బుట్ట బొమ్మా..!

By:  Tupaki Desk   |   12 July 2021 7:00 AM IST
అలలైనా త‌ల వొంచి స‌లాం కొట్టాలి నీకు బుట్ట బొమ్మా..!
X
ముంబై బ్యూటీ పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ మూడు రిలీజ్ ల కోసం ఆస‌క్తిగా వేచి చూస్తోంది. రాధే శ్యామ్ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీల‌పైనా క్లారిటీ వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. మ‌రోవైపు పూజా ప్ర‌ముఖ తెలుగు బ్యాన‌ర్ల‌లో న‌టించేందుకు సంత‌కాలు చేస్తోంద‌ని స‌మాచారం.

త‌మిళంలోనూ ద‌ళ‌ప‌తి విజయ్ స‌ర‌స‌న బీస్ట్ అనే చిత్రంలో న‌టిస్తోంది. అటు బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా కానీ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ చూపిస్తోంది పూజా. తాజాగా బికినీ బీచ్ లో స్వేచ్ఛా విహారం చేస్తూ కెమెరా కంటికి చిక్కింది.

అలా పొట్టి డెనిమ్స్ లూజ్ ష‌ర్ట్ ధ‌రించి బీచ్ స్నానాల కోసం రెడీ అవుతోంది పూజా. తీరంలో అల‌ల ముందుకు వెళ్లే ముందు అలా కెమెరాకి ఫోజులిచ్చింది. పూజా ఎంత సింపుల్ గా ఉందో అంతే హాట్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.