Begin typing your search above and press return to search.

న‌వ్వు ముఖంలో తాండ‌విస్తే చ‌క్క‌ని చుక్కే

By:  Tupaki Desk   |   1 Jun 2021 6:00 PM IST
న‌వ్వు ముఖంలో తాండ‌విస్తే చ‌క్క‌ని చుక్కే
X
టాలీవుడ్ బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ కెరీర్ బండిని ప‌రుగులు పెట్టిస్తున్న బ్యూటీగా పూజాహెగ్డే పేరు మార్మోగుతోంది. మ‌రోవైపు త‌మిళంలోనూ ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న 65వ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లోనూ పూజా ఇన్ స్టాలో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను ఎంట‌ర్ టైన్ చేస్తోంది.

ఇటీవ‌ల త‌న ఫోటోషూట్ లో అత్యంత క్లిష్ఠ‌మైన ఓ షాట్ కోసం చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పూజా వెల్ల‌డించింది. అందుకు సంబంధించిన వీడియోని అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. సమీప భవిష్యత్తులో ఆ సరదా షూటింగ్ రోజులు ఇంకొన్ని ఉండాలని పూజా ఆశిస్తోంది. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ రాహుల్ జాంగియాని తో సరదా షూట్ లు ఇంకా ఉన్నాయి! అని వెల్ల‌డించింది.

మ‌నలో సంతోషం తాండ‌విస్తే అది ఇలా త‌న ముఖంలో బ‌య‌ట‌ప‌డుతుంది!! అంటూ పూజా షేర్ చేసిన కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. పూజా న‌టించిన మూడు సినిమాలు రిలీజ్ ల‌కు రావాల్సి ఉంది. రాధేశ్యామ్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్- ఆచార్య చిత్రాలు రిలీజ్ బ‌రిలో ఉన్నాయి. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల ఇవ‌న్నీ ఆల‌స్యంగా రిలీజ‌య్యేందుకు షెడ్యూల్ చేయ‌డం అభిమానుల్ని నిరాశ‌ప‌రిచింది.