Begin typing your search above and press return to search.

ప్రభాస్ బ్యూటీ హాట్ ఫోటోషూట్.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   1 Jun 2021 6:00 AM IST
ప్రభాస్ బ్యూటీ హాట్ ఫోటోషూట్.. వీడియో వైరల్!
X
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే త్వరలోనే పాన్-ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన పూజా కనిపించనుంది. ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాలో పూజా ప్రేరణ అనే పాత్రలో అలరించనుంది. తాజా సమాచారం ప్రకారం.. డార్లింగ్ ప్రభాస్ - రాధేశ్యామ్ బృందంలోని మరికొందరు సభ్యులతో కలిసి ఇటీవల రాధేశ్యామ్ కాపీని చూశారట. సినిమాలో పూజా యాక్టింగ్ పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. అప్పటినుండి ప్రభాస్ పూజాహెగ్డేను ప్రశంసిస్తూనే ఉన్నాడట. పూజా చేసిన అందమైన బ్యూటిఫుల్ యాక్షన్ - ఆమె సన్నివేశాలు గురించి బాగా డిస్కషన్ చేసాడట. ఖచ్చితంగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాను ప్రేమిస్తారని వారు నమ్మకం వ్యక్తం చేశారు.

తాజా కథనాల ప్రకారం.. రాధేశ్యామ్ మూవీకి సంబంధించి ఒక సాంగ్ షూట్ కొంచం పెండింగ్‌లో ఉందిని.. లాక్‌డౌన్ అనంతరం హైదరాబాద్‌లోనే షూట్ కంప్లీట్ చేయనున్నారు. రాధేశ్యామ్ మొదటి నుండి భారీ షెడ్యూల్ ఇటలీలో షూట్ చేసింది బృందం. ప్రస్తుతం అమ్మడు లాక్డౌన్‌ సమయాన్ని పలు ఫుడ్ ఎక్స్పీరిమెంట్స్ చేయడానికి.. స్క్రిప్ట్‌లను చదవడానికి.. ఆమెకు ఇష్టమైన వినైల్ రికార్డులను వినడానికి.. అలాగే యోగా చేయటానికి సమయం కేటాయిస్తుందట. అయితే సోషల్ మీడియాలో పూజా ఎంత యాక్టీవ్ అనే విషయం విదితమే. తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా తన లేటెస్ట్ ఫోటోషూట్స్ సంబంధించిన రీల్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పూజా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ తో పాటుగా ఫుట్ వేర్ - మేకప్ కిట్ తో సహా పలు హాట్ పోజులను ప్రదర్శించింది.

ప్రస్తుతం పూజా రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. పూజా ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్ తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ - ఆచార్య సినిమాల్లో షూట్ కంప్లీట్ చేసింది. అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దీవాలి సినిమాతో పాటు రన్వీర్ సింగ్ సరసన సర్కస్ సినిమాలో నటిస్తుంది. అదేవిధంగా తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్ సినిమాతో అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. మొత్తానికి అమ్మడు కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు స్ట్రాంగ్ లైనప్ సిద్ధం చేసుకుంది. చూడాలి మరి అమ్మడు త్వరలోనే పాన్ ఇండియా హిట్ అందుకుంటుందేమో!