Begin typing your search above and press return to search.

జానా బెత్తెడు ఫ్రాకులో బుట్ట‌బొమ్మ త‌ళుకులు

By:  Tupaki Desk   |   17 Jan 2021 2:01 PM IST
జానా బెత్తెడు ఫ్రాకులో బుట్ట‌బొమ్మ త‌ళుకులు
X
అల వైకుంఠ‌పుర‌ములో లాంటి ఇండ‌స్ట్రీ హిట్ చిత్రంతో ల‌క్కీ ఛామ్ గా వెలిగిపోతోంది పూజా హెగ్డే. త్రివిక్ర‌మ్ ఈ అమ్మ‌డిని బుట్ట‌బొమ్మగా ఆవిష్క‌రించిన తీరు యూత్ ని మైమ‌రిపించింది. పూజా హెగ్డే ఆ మూవీ ఆద్యంతం చిట్టి పొట్టి ఫ్రాకుల్లో త‌న కాలి సొగ‌సుల్ని ఎంతో అందంగా ఆవిష్క‌రించింది. ఆ సొగ‌సుల‌కు ఫిదా అయిపోయే కుర్రాడిగా బ‌న్ని న‌టించారు.

తాజాగా పూజా విమానాశ్ర‌యంలో అదే లుక్ తో మ‌రోసారి క‌నిపించింది. ఈసారి చిట్టి పొట్టి ఫ్రాకులో అలా ఎయిర్ పోర్ట్ నుంచి న‌డిచొస్తున్న పూజా సొగ‌సుల‌కు మంత్ర ముగ్ధం కానివాళ్లు లేరు. జ‌నాల క‌ళ్ల‌న్నీ ఆ ఫ్రాకుపైనే. అస‌లే థై సొగ‌సుల్ని ఎలివేట్ చేస్తూ ఆ ఫ్రాకును డిజైన్ చేసిన తీరు ఇంప్రెస్సివ్ గా క‌నిపించింది.

మ‌రోవైపు పూజా `రాధేశ్యామ్` షూటింగ్ ని పూర్తి చేసి ముంబైకి వెళ్లింద‌ని స‌మాచారం. త‌దుప‌రి క్యూలో బోలెడ‌న్ని సినిమాలున్నాయి. అటు బాలీవుడ్ లోనూ ప‌లు క్రేజీ చిత్రాల‌కు క‌మిటైంది. అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.