Begin typing your search above and press return to search.

డీజే హీరోయిన్ జోక్ విన్నారా?

By:  Tupaki Desk   |   8 Sept 2017 11:45 AM IST
డీజే హీరోయిన్ జోక్ విన్నారా?
X
టెన్నిస్ ప్రపంచం లెజెండ్స్ లో ఒకడు రోజర్ ఫెదరర్. నెంబర్ వన్ స్థానాన్ని సుదీర్ఘ కాలం కాపాడుకోవడమే కాదు.. ఇప్పటి తరం ప్లేయర్స్ కి కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తూ.. ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటాడు. అయితే.. ఫెదరర్ ఎంత ఆడినా.. తన హెయిర్ స్టైల్ పై చూపించే మక్కువ స్టేడియంలోనే కనిపిస్తూ ఉంటుంది. తన హ్యాండ్సమ్ నెస్ పై కూడా కాన్సంట్రేట్ చేసినా.. ఫెదరర్ ఆటను ఎవరూ తప్పు పట్టరు.

కానీ దువ్వాడ జగన్నాధం హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం.. ఏకంగా రోజర్ పై పెద్ద పంచ్ నే వేసింది. గేమ్ తర్వాత ట్రోఫీ చేతిలో పట్టుకున్న రోజర్ ఫెదరర్ రీసెంట్ ఫోటో ఒకటి.. తను వర్కవుట్స్ చేసిన ఫోటో ఒకటి కలిపి పోస్ట్ చేసి.. ఓ డౌట్ ను వెలిబుచ్చింది పూజా హెగ్డే. ఇంతకీ పూజా అనుమానం ఏంటంటే.. రెండు గంటల పాటు కోర్టులో ఆడిన తర్వాత కూడా ఫెదరర్ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ గా ఉండగా.. 20 నిమిషాల పాటు తాను వర్కవుట్ చేస్తే చింపిరిజుట్టు అయిపోయిన తీరును ఫోటోల ద్వారా పోస్ట్ చేసి.. ఆ సంగతే చెప్పుకొచ్చింది. హౌ అంటూ ఇదెలా సాధ్యమో అంటోంది పూజా.

ఫోటోలు చూడగానే పూజా హెగ్డే డౌట్ నిజమే అనిపించచ్చేమో కానీ.. రెండు గంటల పాటు ఆ గేమ్ ను అలా కంటిన్యూ చేయడం కోసం.. ఏళ్ల తరబడి నిలకడగా కాపాడుకున్న ఫిట్నెస్.. ఆ ప్లేయర్ల సొంతం. బాడీ స్టిఫ్ గా ఉంటూ.. కండిషన్ లో ఉండాలన్న తపన వారిది. కానీ ఏ మాత్రం సన్నబడకుండా.. బాడీలో కొన్ని ఏరియాల్లో ఫ్యాట్ కంటెంట్ తగ్గిస్తూ.. మరికొన్ని చోట్ల కొలతలు కాపాడుకునేలా చేసే వర్కవుట్స్ వీరివి. డైట్ కంటెంట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆ లాజిక్ మర్చిపోయి.. లెజెండరీ ప్లేయర్స్ పై జోకులేస్తే ఎలా డీజే బ్యూటీ!