Begin typing your search above and press return to search.
పూజా హెగ్డేకు ఫస్ట్ సినిమాకు బాగానే ఇచ్చారే
By: Tupaki Desk | 27 April 2021 9:06 PM ISTసాధారణంగా హీరోకు అయినా హీరోయిన్ అయినా తొలి చిత్రంకు రెమ్యునేషన్ చాలా తక్కువ ఉంటుంది. పెద్దగా బేరాలాడేందుకు ఏమీ ఉండదు. నిర్మాత ఎంత అంటే అంత ఇవ్వాలి. అలాగే ప్రాజెక్టు సెట్ చేసిన మీడియేటర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ కు మరీ తక్కువ ఉంటుంది. అవకాశం ఇవ్వటమే గొప్ప విషయంగా చెప్పి చాలా తక్కువ చేతిలో పెడుతూంటారు. అయితే ఆ విషయంలో పూజా హెగ్డే.. గ్రేట్ అనే చెప్పాలి. ఆమె తొలి చిత్రానికి ఇచ్చిన రెమ్యునేషన్ ఎక్కువే.
పూజా హెగ్డే కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎలాంటి సినీనేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూజను అభిమానించేవారు లక్షల్లో ఉన్నారు. తనదైన యాటిట్యూడ్ తో హిట్లు- ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది ఈ బ్యూటీ. ఐతే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న పూజ.. కెరీర్ ఆరంభంలో తన తొలి సినిమాకు అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..? 30 లక్షల రూపాయలట. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫస్ట్ మూవీ తమిళ మూవీ 'మూగముడి'. జీవా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించింది.నిజానికి ఫస్ట్ టైమ్ హీరోయిన్ అంటే ఐదు నుంచి పది లక్షలు వరకూ చేతిలో పెడతారు. ముప్పై లక్షలు అంటే మామూలు విషయం కాదు అంటున్నారు ఇది విన్నవారు.
తన తొలి సంపాదనతో పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికి ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్ని ఆ కారు అంటే పూజాకు ప్రాణం అని చెప్తుంది. ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట.
ఇక పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మ పాటతో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే లాస్ట్ ఇయిర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'రాధే శ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది పూజా హెగ్డే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దీవాళీ' అనే సినిమా చేస్తోంది.