Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ తో రెండవ బర్త్‌డే

By:  Tupaki Desk   |   24 Sep 2020 4:34 PM GMT
రాధేశ్యామ్‌ తో రెండవ బర్త్‌డే
X
ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ 'రాధేశ్యామ్‌'. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో తెరకెక్కతున్న ఈ సినిమా 'సాహో' విడుదలకు ముందే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. గత ఆరు నెలలుగా కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. ఈ నెలలో మళ్లీ షూటింగ్‌ ను పునః ప్రారంభిస్తాం అంటూ దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. రాధేశ్యామ్‌ షూటింగ్‌ లో పూజా హెగ్డే అతి త్వరలో జాయిన్‌ కాబోతుందట. ఆ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.

గత నెలలో రాధాకృష్ణ చేసిన ట్వీట్‌ ను రీ ట్వీట్‌ చేసి.. ఎప్పుడెప్పుడు రాధేశ్యామ్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాలా ఉంది. మీతో సెట్‌ లో రెండవ పుట్టిన రోజు అంటూ పూజా హెగ్డే కామెంట్‌ పెట్టింది. గత ఏడాది రాధేశ్యామ్‌ సెట్‌ లో పూజా హెగ్డే పుట్టిన రోజును కేక్‌ కట్‌ చేయించి జరిపారు. ఈసారి కూడా వచ్చే నెల 13న ఆమె పుట్టిన రోజుకు రాధేశ్యామ్‌ సెట్‌ లో ఉండబోతుంది. దాంతో వచ్చే సారి కూడా నా పుట్టిన రోజు మీతోనే అన్నట్లుగా సరదాగా పూజా హెగ్డే పోస్ట్‌ పెట్టింది.

ప్రస్తుతం అఖిల్‌ తో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా షూటింగ్‌ లో పూజా హెగ్డే పాల్గొంటుంది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని వెంటనే రాధేశ్యామ్‌ షూటింగ్‌ కు జాయిన్‌ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్‌ గత సినిమా సాహో కంటే ఎక్కువ సమయం రాధేశ్యామ్‌ షూటింగ్‌ కు పట్టుతోంది. ఆరు నెలలు కరోనా కారణంగా షూటింగ్‌ జరగక పోవడంతో సినిమాను ఈ ఏడాది విడుదల చేయడం లేదు. వచ్చే ఏడాది సమ్మర్‌ లో లేదా దసరా వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.