Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మ మెల్లగా బాలీవుడ్ కు షిఫ్ట్ అవుతోంది
By: Tupaki Desk | 16 Oct 2020 7:00 AM ISTతమిళంలో సినీ రంగ ప్రవేశం చేసి తెలుగులో ఒక లైలా కోసం.. ముకుందా సినిమాల్లో నటించి ఆ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ లో మొహెంజదారో సినిమాలో నటించిన పూజా హెగ్డే ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ డీజే సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీతో చేసిన డీజేతో పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్ అమాంతం పైకి వెళ్లింది. వరుసగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు బాలీవుడ్ లో మద్య మద్యలో సినిమాలు చేస్తూ వచ్చింది. వచ్చే ఏడాది ఆ తర్వాత ఏడాది వరకు పూజా హెగ్డే బాలీవుడ్ కే పూర్తిగా పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హౌస్ ఫుల్ 4 తర్వాత సల్మాన్ ఖాన్ కు జోడీగా ఒక సినిమాలో నటించే అవకాశంను ఇప్పటికే పూజా హెగ్డే దక్కించుకుంది. ఆ సినిమా త్వరలో పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా కాకుండా హిందీలో మరో సినిమా ఈమె చెంతకు వచ్చింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేకు ఛాన్స్ వచ్చింది. వచ్చే ఏడాదిలో ఈ రెండు సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. 2021లో రెండు కూడా ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆ రెండు సినిమాలు హిట్ అయితే బాలీవుడ్ లో ఈ అమ్మడు బిజీ అవ్వడం ఖాయం అని.. దాంతో సౌత్ సినిమాలను మెల్లగా వదిలేసే అవకాశం కూడా ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో టాలీవుడ్ సినిమాలను పూజా హెగ్డే చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని దాంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పూజా మెల్లగా దూరం అవ్వనుందనే ప్రచారం జరుగుతోంది.