Begin typing your search above and press return to search.

క్లిక్ క్లిక్‌ : వారణాసి హారతిలో బుట్టబొమ్మ

By:  Tupaki Desk   |   7 Oct 2021 9:30 AM GMT
క్లిక్ క్లిక్‌ : వారణాసి హారతిలో బుట్టబొమ్మ
X
టాలీవుడ్‌ స్టార్‌ హాట్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు.. తమిళం.. హిందీ మూడు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. కేవలం కరోనా సమయంలో ఆమె ఖాళీగా ఉంది తప్ప ఆ తర్వాత.. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆమె ఖాళీగా లేదు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా హాట్‌ ఫొటో షూట్ లను.. హాట్‌ సెల్ఫీలను షేర్‌ చేస్తూ ఉండే ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఈసారి షేర్ చేసిన ఫొటోలు ఆమెలోని కొత్త యాంగిల్ ను చూపించాయి. హీరోయిన్స్ ఎక్కువ సమయం సినిమాలతో షూట్‌ లతో బిజీగా ఉంటారు. వారికి దైవ దర్శణం కోసం అస్సలు సమయం దొరకదు. కొందరు మాత్రం సమయం కల్పించుకుని వెళ్తారు.. కాని కొందరు మాత్రం వీలు పడటం లేదు.. సాధ్యం కాలేదు అంటూ ఉంటారు. పూజా హెగ్డే తాజాగా వీలు కల్పించుకుని వారణాసి వెళ్లింది.

వారణాసి అనగానే గంగా హారతి.. శివుడి హారతి గుర్తుకు వస్తుంది. అక్కడకు వెళ్లిన వారు చాలా మంది హారతిని దర్శించుకుంటూ ఉంటారు. తాజాగా పూజా హెగ్డే కూడా శివుడి హారతి దర్శనం చేసుకుంది. గంగా హారతిలో కూడా పాల్గొన్న పూజా హెగ్డే తనకు మానసిక సంతృప్తిని కలిగించిందంటూ పేర్కొంది. ఈ ఫొటోలు షేర్‌ చేసిన ఆమె అద్బుతమైన ప్రదేశానికి నేను వెళ్లాను.. అక్కడ ప్రత్యేకమైన పాన్‌ ను కూడా తిన్నట్లుగా చెప్పుకొచ్చింది. వారణాసిలో ప్రశాంతతను అనుభవించినట్లుగా చెప్పిన పూజా హెగ్డే అందుకు సంబంధించిన పిక్స్ ను షేర్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగు లో ఈమె నటించిన మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్ విడుదలకు సిద్దంగా ఉంది. దసరాకు బ్యాచిలర్‌ విడుదల కాబోతుంది. ఇక ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాలు కాకుండా తెలుగు లో ఇంకా కొన్ని సినిమాలను కూడా కమిట్‌ అయ్యింది. ఇక తమిళంలో స్టార్‌ హీరో సినిమాలో నటిస్తోంది. హిందీలో రెండు భారీ సినిమాల్లో ఈమె నటిస్తోంది. ఒకే సారి మూడు భాషల్లో పెద్ద హీరోలతో నటిస్తున్న హీరోయిన్ గా అరుదైన గౌరవంను ఈమె అందుకుంది.