Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మ సంపాదనంతా ఇంటికేనా!
By: Tupaki Desk | 10 Nov 2021 5:00 AM ISTబుట్టబొమ్మ పూజాహెగ్దే కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. షూటింగ్ కి వెళ్లాలంటే ప్రయివేట్ చార్టెడ్ ప్లైట్ నే మెయింటెన్ చేస్తుందంటే పూజా రేంజ్ ఏ స్థాయికి రీచ్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. పర్సనల్ గా ఎక్కడికి వెళ్లినా వెంట బాడీ గార్డుల తో వెళ్తోంది. బాలీవుడ్ స్టార్లు..గ్లోబర్ స్టార్లు సైతం చేయని మెయింటెన్ చేస్తోంది. ఇక పూజా పారితోషికం విషయానిక్ఇ వస్తే ఒక్కో సినిమాను 3 కోట్లు ఛార్జ్ చేస్తోంది. ఇంకా అదనంగా కొన్ని ఖర్చులు నిర్మాత భరించాలి. ఇలా పారితోషికం అందుకోవడం మార్కెట్ లో నయనతారకే గట్టి పోటినిస్తోంది. కోటి అడ్వాన్స్ అకౌంట్ లో పడితేనే సినిమాకు సైన్ చేసేది.
ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా డోంట్ కేర్ అనే టైపులో వ్యవహారం నడిపిస్తోంది. మరి ఇంత గా వెలిగిపోతున్న బ్యూటీ తొలి సినిమాకు అందుకున్న పారితోషికం ఎంతంటే? అక్షరాల 30 లక్షలు అట. ఆ డబ్బుతోనే బీఎండబ్ల్యూ కారు కొన్నదిట. ఇప్పటికీ ఆ కారు తన దగ్గరే ఉంది. ఎంతో ఆపురూపంగా ఓ గుర్తుగా దాన్ని భావిస్తానని పూజా తెలిపింది. అలాగే డబ్బు వినియోగం విషయంలో చాలా జాగ్రత్త ఉంటుందిట. తన తల్లి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కొన్ని పాఠాలు చెప్పి పంపించిందని..తల్లి మాట వేద వాక్కులు లాంటివని పూజా అభిప్రాయ పడింది.
తన ఖర్చులు మినహా డబ్బు అంతా అమ్మ దగ్గరే ఉంటుందని అంటోంది. పూజాహెగ్డే కోలీవుడ్ లో జీవా హీరోగా నటించని `మూగముడి` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆసినిమాకే 30 లక్షలు అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో బిజీ అయింది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ప్రభాస్ సరసన `రాధేశ్యామ్` లో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `.ఆచార్య`లోనూ నటిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.