Begin typing your search above and press return to search.

వీడియో కాల్ లోనే `భ‌వ‌దీయుడి`తో లాకైపోయింద‌ట‌

By:  Tupaki Desk   |   12 Sep 2021 9:32 AM GMT
వీడియో కాల్ లోనే `భ‌వ‌దీయుడి`తో లాకైపోయింద‌ట‌
X
ముంబై టు హైద‌రాబాద్ ఇండ‌స్ట్రీ పూజా క‌మ్యూనికేష‌న్ అసాధార‌ణం. ఈ బ్యూటీ టాలీవుడ్ లో బంగారు బాతులా మారింది. గోల్డెన్ లెగ్ అని కీర్తిని అందుకుంటోంది. ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత త‌న రేంజు మ‌రో లెవల్ కి చేరుకుంది. ఇప్పుడు పూజా ఎంత అడిగితే అంతే ఇస్తున్నారు నిర్మాత‌లు. పారితోషికంలో పూజా డిమాండ్ల‌పై విరుచుకుప‌డేవాళ్లు లేక‌పోలేదు.

అయితే పూజా ఇంత‌కాలం ప‌వ‌న్ స‌ర‌స‌న ఆఫ‌ర్ అందుకోని సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా బ‌న్ని.. వ‌రుణ్ తేజ్ ల‌తో న‌టించేసిన ఈ బ్యూటీ త‌దుప‌రి చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆచార్య‌లో న‌టిస్తోంది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న టార్గెట్ అని తెలిసింది. అయితే హ‌రీష్ శంక‌ర్ తో త‌న స్నేహాన్ని పూజా వ‌ర్క‌వుట్ చేస్తోంద‌ట‌. ఆ ఇద్ద‌ర్నీ టాలీవుడ్ మంచి స్నేహితులుగా క‌లిపింది.

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` లో అమ్మ‌డు తొలుత హీరోయ‌న్ గా న‌టించింది. కెరీర్ ఆరంభంలో వ‌చ్చిన‌ అవ‌కాశం కూడా . ఆ సినిమా మంచి ఫ‌లితాలు కూడా సాధించింది. ఆ స‌క్సెస్ త‌ర్వాత పూజా హెగ్డేకి వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. అలా పూజా హెగ్డే కెరీర్ లో హ‌రీష్ మంచి స్నేహితుడిగా మారాడు. ఆ స్నేహంతోనే `గ‌ద్ద‌లకొండ‌ గ‌ణేష్` లో పూజా నాయిక‌గా న‌టించింది. న‌టిగా బిజీగా ఉన్న స‌మ‌యంలోనూ హ‌రీష్ తో స్నేహం కార‌ణంగా ఈ చిత్రానికి అంగీక‌రించింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ కూడా హ‌రీష్ శంక‌ర్ కి మంచి స్నేహితుడు. హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల‌న్నింటికీ దాదాపు దేవి శ్రీనే సంగీతం స‌మకూర్చారు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ `భవ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` టైటిల్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇటీవ‌లే ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2 ఆ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేసారు. ప్ర‌స్తుతం హరీష్ ఆ సినిమాకు సంబంధించి న‌టీన‌టుల ఎంపిక‌లో బిజీగా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ ముగ్గురు వీడియో కాల్ లో క నెక్ట్ అయ్యారు. ముందుగా హ‌రీష్‌-పూజా హెగ్డే సంభాషించుకుంటున్నారు.

ఇంతలో రాక్ స్టార్ కూడా లైన్ లోకి వ‌చ్చారు. దీంతో ముగ్గురి మ‌ధ్య స‌రదా సంభాష‌ణ‌లు సాగిన‌ట్లు తెలుస్తోంది. అయితే భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఇందులో హీరోయిన్ ని ఫైన‌ల్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిస్థితుల్ని బ‌ట్టి చూస్తుంటే ఆ ఛాన్స్ పూజా హెగ్డే అందుకుంద‌న్న వార్త గ‌ట్టిగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్ .. కోలీవుడ్..బాలీవుడ్ ల‌ లో బిజీగా ఉంది. మూడు భాష‌ల్లో మూడే సినిమాలు చేస్తోంది. క‌రోనా క్రైసిస్ లో జూమ్ మీటింగుల‌తోనే కోట్లాది రూపాయ‌ల విలువైన డీల్స్ కుదురుతున్నాయి. క‌థానాయిక‌ల్ని ఇలానే ఫైన‌ల్ చేసేస్తుండ‌డం ఆస‌క్తిక‌రమే.

క్రైసిస్ లోనూ రియ‌ల్ ల‌క్కీ గాళ్

పూజా హెగ్డే న‌టించిన ఆచార్య‌-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ - రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తూ మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీగా ఉంది. ఇండ‌స్ట్రీలో భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు ఆమెనే కోరుతున్నారు. ఇటీవల పూజా మహేష్ బాబు - త్రివిక్రమ్ చిత్రానికి సంతకం చేసింది. ఇంత‌లోనే ప‌వ‌న్ తో ఆఫ‌ర్. అలాగే మ‌రో రెండు ఆఫర్లు ద‌క్కాయిట‌. త్వరలో ప్రారంభించబడే మరో రెండు పెద్ద విషయాలపై సంతకం చేయ‌నుంద‌ని తెలిసింది.