Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో పాప్ స్టార్ గా మారిన‌ బికినీ బేబి

By:  Tupaki Desk   |   14 Nov 2021 9:29 PM IST
మాల్దీవుల్లో పాప్ స్టార్ గా మారిన‌ బికినీ బేబి
X
పూజా హెగ్డే ప్రస్తుతం మాల్దీవుల విహారాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె రెడ్ హాట్ బికినీలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఓవైపు టాలీవుడ్ కోలీవుడ్ లో వ‌రుస‌ చిత్రాలతో గత కొన్ని నెలలుగా బిజీగా ఉన్న పూజా కొద్ది రోజుల పాటు విరామం కోరుకుంది. బీచ్ సెల‌బ్రేష‌న్స్ కోసం ద్వీప దేశానికి వెళ్లింది. పూజా మాల్దీవుల నుండి అద్భుతమైన ఫోటోలు వీడియోలను అభిమానులకు షేర్ చేస్తోంది.

పూజా ఎరుపు రంగు బికినీలో పాప్ సంగీతానికి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకోగా ఆ వీడియోకు ``విబిన్ మరియు త్రివిన్ (sic)`` అని క్యాప్షన్ ఇచ్చింది. రిసార్ట్ లో అల్పాహారం ఫోటోను కూడా నటి షేర్ చేసింది. పూజా టోన్డ్ బాడీకి త‌గ్గ‌ట్టుగానే ఆ ఎరుపు రంగు బికినీ సంథింగ్ హాట్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. బికినీలో డ్యాన్సింగ్ చేస్తూ పూజా క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ట్రీటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌లే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంతో విజ‌యం అందుకుంది. త‌దుప‌రి రాధే శ్యామ్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 14 జనవరి 2022న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

దేశంలోనే అత్యంత బిజీ నాయిక‌ల్లో పూజా హెగ్డే ఒకరు. ఇప్ప‌టికిప్పుడు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్న‌ దాదాపు అర డజను సినిమాలు ఉన్నాయి. పూజా ఇటీవల `మృగం` (బీస్ట్) షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. ప్రభాస్ తో `రాధే శ్యామ్`.. చిరంజీవి-రామ్ చరణ్ ల ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసింది. రణవీర్ సింగ్ `సర్కస్` .. సల్మాన్ ఖాన్ తో `భాయిజాన్` చిత్రాల్లోనూ న‌టిస్తోంది.