Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర పిల్లగా మురిపించేసిందే

By:  Tupaki Desk   |   23 May 2018 4:58 PM IST
మహారాష్ట్ర పిల్లగా మురిపించేసిందే
X
మామూలుగా హీరోయిన్లు ఎవరైనా కూడా సినిమాలోని పాత్ర కోసం ఎన్ని వేషాలైనా వేస్తారు. ఐశ్వర్య రాయ్ సారబ్జిత్ లోముసలావిడ పాత్రలో ఒదిగిపోతే.. ఆటిజం పేషెంటుగా బర్ఫీ సినిమాలో ప్రియాంక చోప్రా పండించేసింది. పక్కా విలేజీ పిల్లలా మన సమంత రంగస్థలంలో రెచ్చిపోతే.. అచ్చం సావిత్రిలా మహానటిలో కీర్తి సురేష్ మెప్పిచేసింది. ఇలా తెర మీద ఏ పాత్రను వేసినా కూడా భామలు రక్తి కట్టిస్తారు. అయితే డస్కీబ్యూటి పూజా హెగ్డే మాత్రం.. తెర బయట కూడా ఇరగదీస్తోంది.

మొన్ననే తెలుగులో రంగస్థలం కోసం ఊరమాస్ రికార్డింగు డ్యాన్సులు వేసుకునే గోదావరి జిల్లా అమ్మాయిగా కనిపించింది పూజా హెగ్డే. 'జిగేలు రాణి' అంటూ ఒక టెరిఫిక్ బాడీ లాంగ్వేజ్ తో భలే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మాత్రం పక్కా మహారాష్ట్ర అమ్మాయిగా అలరిస్తోంది. అయితే అటా మజా సటక్కలీ అంటూ ఏ పాటకో చిందేయట్లేదు కాని.. తన ప్రాణ స్నేహితురాలైన ఒక మరాఠి అమ్మాయి పెళ్ళిలో అలా మరాఠి నారి అవతారంలో అమ్మడు మెరిసిపోయింది. కాకపోతే ఎంతైనా కూడా హాట్ మోడల్ అండ్ హీరోయిన్ కదా.. ట్రెడిషనల్ బట్టల్లో కూడా తన వయ్యారాల వడ్డనతో అలరించేసింది.

ఇకపోతే మొన్న రిలీజైన ''అరవిందా సమేత'' సినిమా మోషన్ పోస్టర్ కు మంచి రెస్సాన్స్ రావడంతో.. అమ్మడు టాలీవుడ్ లో తన టైమ్ మొదలైంది అంటూ మాంచి ఎక్సయిటై పోతోందట. త్వరలోనే సాక్ష్యం.. మహేష్‌25 సినిమాల్లో కూడా అమ్మడు తన సత్తా చాటుకోనుందిలే.

మరిన్ని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి