Begin typing your search above and press return to search.

హడావుడి తో చుక్కలు చూపిస్తున్న బుట్టబొమ్మ

By:  Tupaki Desk   |   27 Jan 2020 11:42 AM IST
హడావుడి తో చుక్కలు చూపిస్తున్న బుట్టబొమ్మ
X
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే. నటన విషయంలో వీక్ అయినప్పటీ గ్లామర్ తోనే ఆఫర్లు పట్టేస్తున్న ఈ బ్యూటీకి నిన్న మొన్నటి వరకూ నిఖార్సైన హిట్టు లేదు. కెరీర్లో డిజాస్టర్ల కు మాత్రం లోటే లేదు. అయితే ఈ సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో అమ్మడి ఆనందానికి అవధులు లేవు. ఈ ఊపు ఎక్కువ కావడంతో ఆ ప్రభావం పూజ పనిచేస్తున్న తదుపరి చిత్రాలపై పడుతోందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు సాలిడ్ హిట్ ఒక్కటీ కూడా లేని సమయంలోనే పూజా మెయింటెనెన్స్ ఒక రేంజ్ లో ఉండేదట. ఇప్పుడు అసలు సిసలు బ్లాక్ బస్టర్ తగిలింది కాబట్టి ఆ మెయింటెనెన్స్ ను మరింతగా పెంచి నెక్స్ట్ సినిమాల నిర్మాతల కు చుక్కలు చూపిస్తోందట. పూజకు వ్యక్తిగత సహాయకుల సిబ్బంది మాత్రమే అరడజను మంది ఉన్నారట. ఈ హడావుడిని ఫిలిం యూనిట్ వాళ్లు భరించ లేకపోతున్నారని.. నిఖార్సైన హిట్ ఒక్కటి తగిలితేనే పరిస్థితి ఇలా ఉంటే వరసగా రెండు మూడు సాలిడ్ హిట్లు తగిలితే పూజాను ఏమాత్రం ఆపలేమని అనుకుంటున్నారట.

సక్సెస్ అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఇలా విజయం దక్కినప్పుడు మరింతగా కష్టపడుతూ.. అణకువగా ఉంటేనే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుందని.. లేనిపోని హడావుడి చేస్తూ ఫిలిం మేకర్ల ను ఇబ్బంది పెడితే అది పూజా కే నష్టమని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ బుట్టబొమ్మ.. ఫ్యాషన్ మ్యాగజైన్ల అట్టబొమ్మ ఇట్టాంటి మంచి మాటలను వింటుందో లేదో!