Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : ఫ్యామిలీతో దీపావళి పూజలో పూజా హెగ్డే

By:  Tupaki Desk   |   5 Nov 2021 6:30 AM GMT
ఫొటోటాక్ : ఫ్యామిలీతో దీపావళి పూజలో పూజా హెగ్డే
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ మరియు ఏదో ఒక ప్రత్యేకమైన ప్రమోషనల్‌ ఫొటోలు లేదా వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. కాని ఈసారి మాత్రం పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. పూజా హెగ్డే దీపావళి సందర్బంగా తన కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నది. అంతే కాకుండా ఆమె దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా జరుపుకున్నట్లుగా ఆమె షేర్‌ చేసిన ఫొటోలను చూస్తుంటే అర్థం అవుతోంది. సాంప్రదాయబద్దమైన చీరలో కనిపించిన పూజా హెగ్డే ను మొదటి సారి ఇలా చూస్తున్నట్లుగా ఉందని.. చాలా అందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

దీపావళి సందర్బంగా సెలబ్రెటీలు అంతా కూడా షూటింగ్స్ ను పక్కకు పెట్టి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకునేందుకు వెళ్తారు. పూజా హెగ్డే కూడా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సెల్రబేషన్స్ లో పాల్గొన్నది. ఫ్యామిలీ తో ప్రతి సంవత్సరం కూడా ఇలా దీపావళి పండుగ జరుపుకోవడం జరుగుతుందని.. దీపావళి తనకు చాలా స్పెషల్‌ పండుగ అన్నట్లుగా పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులు మరియు సోదరుడితో కలిసి ఆమె దిగిన పొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మొదటి సారి పూజా హెగ్డే సోషల్‌ మీడయా ద్వారా తన కుటుంబం మొత్తం పిక్ ను షేర్‌ చేసింది.

ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ముద్దుగుమ్మ నటించిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత రాధే శ్యామ్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు పూజా హెగ్డే రాబోతుంది. ఆచార్య లో కూడా ఈమె గెస్ట్‌ గా కనిపించింది. ఆ సినిమా ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది. ఇంకా పలు తెలుగు సినిమాల్లో కూడా ఈమె నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు తమిళం మరియు హిందీల్లో కూడా ఈమె సినిమాలు నటిస్తోంది. ఒకే సారి మూడు భాషల్లో కూడా ఈమె సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఈమె నటించిన మూడు నాలుగు సినిమా లు విడుదల అవ్వబోతున్నాయి.