Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైమ్ బుట్టబొమ్మ యాక్షన్ రోల్

By:  Tupaki Desk   |   5 Jun 2022 1:37 PM IST
ఫస్ట్ టైమ్ బుట్టబొమ్మ యాక్షన్ రోల్
X
టాలీవుడ్ బుట్టబొమ్మ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న పూజా హెగ్డే వరుసగా పరాజయాలు వచ్చినా కూడా తన స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు.  వరుస అపజయాలతోనే కెరీర్ ను మొదలు పెట్టిన పూజా ఆ తర్వాత తన గ్లామర్ తోనే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు అందుకుంది. ఇక త్రివిక్రమ్ అల.. వైకుంఠపురములో సక్సెస్ అనంతరం అస్సలు వెనక్కి తిరిగి చూడడం లేదు.

ఇక రీసెంట్ గా అమ్మడు వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.  ప్రభాస్ రాధే శ్యామ్ తో  పాటు ఆచార్య, బీస్ట్ సినిమాలు వరుసగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.  అయినప్పటికీ కూడా బుట్టబొమ్మ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరి ఇంకా పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే కెరీర్ మొదటి నుంచి కూడా ప్రతి సినిమాలో ఒక నేచురల్ గ్లామరస్ బ్యూటీ గానే కనిపించింది.

తన క్యారెక్టర్ విషయంలో కూడా పెద్దగా హడావుడి లేకుండా దర్శనం ఇచ్చింది అనే చెప్పాలి. అయితే ఈ బ్యూటీ తన నటన కూడా సరి కొత్తగా ఉండాలి అని కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా యాక్షన్ క్యారెక్టర్ తో ఆకట్టుకునే అవకాశం ఉందట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనగణమన అనే ఆర్మీ బ్యాక్ డ్రాప్ ప్రాజెక్టు పై పూరి అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే రీసెంట్ గా సినిమాకు సంబంధించిన రెగ్యులర్ వర్క్స్ కూడా మొదలుపెట్టారు. నేడు ముంబైలోని ఒక ప్రత్యేకమైన సెట్లో స్పెషల్ టా పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర మాత్రం చాలా పవర్ఫుల్ గా యాక్షన్ తరహాలో ఉంటుందట. అంటే హీరోలతో సమానంగా బుట్ట బొమ్మ మొదటిసారి యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుంతుందట. మరి అమ్మడి ఆశలకు తగ్గట్టుగా ఆ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.