Begin typing your search above and press return to search.

పూజాహెగ్డేకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అతనెవరంటే: త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   12 Jan 2021 11:30 AM GMT
పూజాహెగ్డేకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.. అతనెవరంటే: త్రివిక్రమ్
X
స్టార్ హీరో అల్లు అర్జున్ భారీ గ్యాప్ తీసుకుని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన హ్యాట్రిక్ మూవీ 'అల వైకుంఠపురంలో'. ఈ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలతో పాటు, డిస్ట్రిబ్యూటర్లు కూడా అంతా ఆర్థికంగా లాభాలను ఖాతాలలో వేసుకున్నారు. అయితే తెలుగులో విడుదలైన సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ లభిస్తుంది. అందులో భాగంగా “అల వైకుంఠపురంలో” సినిమా బాలీవుడ్ లో కూడా రూపొందనుంది. అయితే ఈ సినిమా కేవలం తెలుగు బాషలో మాత్రమే విడుదలై దాదాపు 150కోట్ల వరకు వసూల్ చేసిందట. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కలిసి సినిమాను హిట్ చేస్తే.. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే సాంగ్స్ ఆల్బమ్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ తీసుకొచ్చాడు. అయితే తాజాగా వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంది 'అల వైకుంఠపురంలో' టీమ్.

ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సినిమాలో నటించిన నటినటులు, టెక్నీషియన్లు అందరూ మాట్లాడారు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్ కలిసి హీరోయిన్ పూజా హెగ్డేను ఆటపట్టించారాని చెప్పాలి. పూజా హెగ్డే ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతుంది. అయితే అల వైకుంఠపురంలో అనేది మాత్రం ఆమె స్టార్డంను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పూజా బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో చాలా సినిమాలు చేసి తెలుగు కుర్రాడినే పెళ్లాడాలని ఫన్నీ కామెంట్స్ చేసాడు. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ.. పూజాకి మా డైరెక్షన్ డిపార్టుమెంటులోనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి షాకిచ్చాడు. అది ఎవరో కాదు మా అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్ అంటూ నవ్వించాడు. మా షూటింగ్ జరిగినన్ని రోజులు ఆనంద్ పూజాకి కథ వినిపించాడు. ఆమెకు ఆనంద్ కథ చెప్తే నిద్రపోయెదని.. అంతబాగా చెప్పేవాడంటూ పూజా పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వారి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.