Begin typing your search above and press return to search.

మొహెంజొదారో బ్యూటీకి అదొక్కటి దక్కింది

By:  Tupaki Desk   |   14 Nov 2016 10:39 AM IST
మొహెంజొదారో బ్యూటీకి అదొక్కటి దక్కింది
X
ఒక్కో ఇండస్ట్రీలో ఒకటో రెండో సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ కి వెళ్లిన భామ పూజా హెగ్డే. తమిళ్ లో జీవా సరసన ముగమూడి(తెలుగులో మాస్క్)తో అరంగేట్రం చేసింది. తెలుగులో చైతుతో ఒక లైలా కోసం.. వరుణ్ తేజ్ తో ముకుంద చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి మొహెంజొదారో అవకాశం దక్కించుకుంది. విచిత్రం ఏంటంటే.. తమిళ్.. తెలుగుల్లో అరంగేట్రంతోనే.. 'బెస్ట్ డిబట్ యాక్ట్రస్' అవార్డు అందుకున్న పూజా హెగ్డే.. బాలీవుడ్ లో కూడా ఇదే అవార్డు దక్కించుకోగలిగింది.

రీసెంట్ గా జరిగిన లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటి అవార్డు గెలుచుకుంది. 'మొదటి అవార్డ్ ఎప్పుడూ ప్రత్యేకమే' అంటూ ఓ ట్వీట్ కూడా పెట్టింది. అవార్డయితే వచ్చింది కానీ.. అమ్మడి బాలీవుడ్ ఆశలు మాత్రం నెరవేరలేదు. మొహెంజొదారో చిత్రం బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలవడంతో.. ఆ డ్రీమ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఈ సినిమా దెబ్బకి ఓ హాలీవుడ్ స్టూడియో కూడా ఇండియా నుంచి జెండా పీకేయడం చెప్పుకోవాలి.

మొహెంజొదారో రిలీజ్ కి ముందే టాలీవుడ్ మూవీ బన్నీ దగ్గర నుంచి ఆఫర్ వెళ్తే పోజ్ కొట్టిన పూజా హెగ్డే.. ఆ ఫెయిల్యూర్ తర్వాత 'డీజే-దువ్వాడ జగన్నాధం'లో ఆఫర్ ను యాక్సెప్ట్ చేసి.. తిరిగి టాలీవుడ్ కి వచ్చేసింది. మరి ఈ మూవీతో అయినా సక్సెస్ సాధిస్తే.. అమ్మడి డ్రీమ్స్ లో కొన్నయినా నెరవేరతాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/