Begin typing your search above and press return to search.

సమ్మర్ వేర్ లో డీజే భామ భలేగుంది

By:  Tupaki Desk   |   31 March 2017 2:07 PM IST
సమ్మర్ వేర్ లో డీజే భామ భలేగుంది
X
డీజే-దువ్వాడ జగన్నాధం మూవీలో అల్లు అర్జున్ కి హీరోయిన్ గా చేస్తుండడంతో.. పూజా హెగ్డే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందే ఒకట్రెండు సినిమాల్లో కనిపించినా.. డీజే తెచ్చిపెడుతున్న పేరు చాలా ఎక్కువ.

ఫ్యాషన్ విషయంలో కూడా ఈ భామ చాలా ట్రెండీగా ఉటుంది. మరిప్పుడు సమ్మర్ మొదలైపోయింది. ఇలాంటి టైంలో ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలో చెప్పమంటే.. ఈ సుందరాంగి చెప్పడం ఎందుకు చూపిస్తాను కదా అంటూ రకరకాల స్టైలింగ్స్ తో మెరిసిపోయింది. నిండుగా కప్పుకుంటే లూజ్ డ్రెస్ లు.. స్కిన్ టైట్ అయితే షార్ట్ డ్రెస్ లతో తన స్టైలింగ్ ను భలే చూపించింది. ఇవన్నీ ట్రెండీగానే కాదు.. టైమింగ్ ప్రకారం కన్వీనియంట్ గాను.. స్టైలిష్ గాను ఉన్నాయిలే.

అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు చుట్టేస్తూ.. రెండు చోట్లా పాగా వేసేందుకు పూజా హెగ్డే ప్రయత్నాలు బాగానే కొనసాగుతున్నాయి. మధ్యమధ్యలో ఇలాంటి స్టైలింగ్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. 2010లోనే మిస్ ఇండియా యూనివర్స్ కాంపిటీషన్స్ లో పాల్గొంది కదా.. ఆ మాత్రం ఫ్యాషన్ ఫాలో అవకపోతే ఎలా!




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/