Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల ల‌క్కీ నెంబ‌ర్.. ల‌క్కీ హీరోయిన్!

By:  Tupaki Desk   |   30 Aug 2021 5:00 AM IST
స్టార్ హీరోల ల‌క్కీ నెంబ‌ర్.. ల‌క్కీ హీరోయిన్!
X
చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన్ని కొన్ని కాంబినేష‌న్స్ గురించి.. నంబ‌ర్ సెంటిమెంట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ముఖ్యంగా నంబ‌ర్ -7 చిత్ర‌ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల‌కు పెద్ద ట‌ర్నింగ్ పాయింట్ గా మారిన సంద‌ర్భాలున్నాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల కెరీర్ కి నంబ‌ర్ 7 కీల‌క‌మైన‌ది.. ఎన్టీఆర్ కెరీర్ లో 7వ చిత్రం `సింహాద్రి`.. మ‌హేష్ కెరీర్ లో అదే నెంబర్ చిత్రం `ఒక్క‌డు`.. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏడ‌వ చిత్రం `ఖుషీ` బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నాలుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ఈ మూడు చిత్రాలు ఆ హీరోల కెరీర్ కి కీల‌క మ‌లుపు. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌తో బెస్ట్ గా నిలిచాయి. ఆస‌క్తిక‌రంగా ఈ మూడు చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన ల‌క్కీ ఛామ్ కూడా ఒక్క‌రే. ఆ అందాల నాయిక‌ భూమిక‌. స‌రిగ్గా ఇప్పుడు అలాంటి అరుదైన అవ‌కాశం బుట్ట‌బొమ్మ ఖాతాలో ప‌డుతోంది. పూజా కెరీర్ కి ఒక క్రేజీ నంబ‌ర్ యాడ‌వుతోంది. ఎన్టీర్ 28వ సినిమా `అర‌వింద స‌మేత` పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే.

అలాగే ప‌వ‌న్ 28వ చిత్రానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజాని ఫైన‌ల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ 28వ చిత్రం ఖరారైంది. ఇందులోనూ పూజా హెగ్డేని తీసుకుంటున్నారు. అలా అప్పుడు ఆ ముగ్గురు స్టార్ హీరోల ల‌క్కీ ఛామ్ భూమిక అయితే ఇప్పుడు పూజా హెగ్డే కి ఆ ఛాన్స్ ద‌క్క‌డం విశేషం.