Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌ని వేధిస్తున్న‌ డేట్స్ స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   15 Feb 2022 7:00 AM IST
బుట్ట‌బొమ్మ‌ని వేధిస్తున్న‌ డేట్స్ స‌మ‌స్య‌
X
వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ గా స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకుంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. `అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డంతో ఈ అమ్మ‌డి క్రేజ్ తారా స్థాయికి చేరింది.

దీంతో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంది. తెలుగులో `రాధేశ్యామ్‌` తో పాటు ఆచార్య‌లోనూ న‌టించింది. ఈ రెండు చిత్రాలు ప్ర‌స్తుతం రిలీజ్ కి కెడీ అయిపోయాయి.

ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించిన `రాధేశ్యామ్‌` మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ మూవ ఈప్ర‌మోష‌న్స్ ని భారీ స్థాయిలో మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 14న రిలీజ్ అనుకున్న స‌మ‌యంలో డిసెంబ‌ర్ లో మేక‌ర్స్ భారీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

అయితే రిలీజ్ డేట్ మారి ఫైన‌ల్ గా మార్చి 11న విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ మ‌రోసారి ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేయ‌బోతున్నారు.

ఇందు కోసం ముందుగా ఓ భారీ సెట్ ని నిర్మించి ఓ భారీ ఈవెంట్ ని నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ మూవీ రిలీజ్ కు ఈ ఈవెంట్ ని దాదాపు రెండు వారాల ముందు జ‌ర‌పాల‌ని ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌.

అయితే ఈ భారీ ఈవెంట్ లో పూజా హెగ్డే మాత్రం పాల్గొన‌డం లేద‌ని తెలిసింది. గ‌త కొన్ని రోజులుగా పూజా హెగ్డే మేక‌ర్స్ కి స‌హ‌క‌రించ‌డం లేదంటూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే వాస్త‌వం మాత్రం అది కాద‌ని, పూజా హెగ్డే బిజీ షెడ్యూల్ కారణంగానే ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో పాపాల్గొన‌లేక‌పోతోంద‌ని, ఆమె కు డేట్స్ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారాయ‌ని, డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేకే పూజా హెగ్డే స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు.

గ‌త కొంత కాలంగా వ‌రుస షూటింగ్ ల‌తో బిజీగా వున్న పూజా హెగ్డే ఇటీవ‌లే త‌న ఫ్యామిలీతో క‌లిసి దాదాపు 13 ఏళ్ల విరామం త‌రువాత వెకేష‌న్ కి వెళ్లింది.

తిరిగి వ‌చ్చాక ర‌ణ్ వీర్ సింగ్ , రోహిత్ శెట్టిల `స‌ర్క‌స్‌` మూవీలో న‌టించ‌నుంది. అంతే కాకుండా మ‌రి కొన్ని చిత్రాల‌కు క‌మిట్ కాబోతోంది. దీంతో ఆమెకు డేట్స్ స‌మ‌స్య త‌లెత్తింద‌ని, ఆకార‌ణంగానే `రాధేశ్యామ్‌` ప్ర‌యోష‌న్స్ లో పాల్గొన‌లేక‌పోతోంద‌ని అంటున్నారు. `రాధేశ్యామ్‌` తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ మార్చి 11న విడుద‌ల కాబోతోంది.