Begin typing your search above and press return to search.

అందాలను కొలువు దీర్చిన డీజే బ్యూటీ

By:  Tupaki Desk   |   25 March 2017 10:11 PM IST
అందాలను కొలువు దీర్చిన డీజే బ్యూటీ
X
ఇండియా ఫ్యాషన్ కేపిటల్ ముంబైలో ఎన్నెన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది. తాజాగా హిందుస్తాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్ జరగగా.. ఈ కార్యక్రమంలో అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. అందాల భామలు రకరకాల డ్రెస్ లతో ఆకట్టుకున్నారు.

స్లిట్ డ్రెస్ లు.. గ్లామరస్ గౌన్లు.. లాంజీ జాకెట్స్.. ఇలా ఎన్నెన్నో స్టైల్స్ చూపించేశారు. మొహెంజొదారో మూవీతో గతేడాది బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముకుంద బ్యూటీ పూజా హెగ్డే.. హెచ్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్ లో భలే మెరిసిపోయింది. స్నఫ్ కలర్ డ్రెస్ లో అమ్మడు అందాలను కొలువు దీర్చిన విధానం అదిరిపోయిందని చెప్పాల్సిందే. ఇటు క్లీవేజ్ షోకులు చూపించీ చూపించకుండా.. నడుం ఒంపులు కనిపించేలా.. నాభి సొగసులు దాచుకుంటూ.. అమ్మడి గెటప్ సూపర్బ్ అనాల్సిందే. లైట్ స్నఫ్ కలర్ డ్రెస్ అమ్మడి స్కిన్ టోన్ కి దగ్గరగా ఉండడంతో.. అందం మరింతగా ఇనుమడించేసింది.

ఇక పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్ మూవీ డీజేలో నటిస్తుండగా.. రీసెంట్ గా దుబాయ్ లో పాటల షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది. ఇంకా కొంత భాగం షూటింగ్ పెండింగ్.. ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉండగా.. డీజే మూవీతో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పూజా హెగ్డే సిద్ధమైపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/