Begin typing your search above and press return to search.

ఏ ఒక్కరికి నో చెప్పని స్టార్ హీరోయిన్‌.. ఇష్టం లేకుంటే అలా చేస్తోందట!

By:  Tupaki Desk   |   16 April 2021 12:30 AM GMT
ఏ ఒక్కరికి నో చెప్పని స్టార్ హీరోయిన్‌.. ఇష్టం లేకుంటే అలా చేస్తోందట!
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ అండ్‌ క్రేజీ హీరోయిన్స్‌ జాబితాలో మొదట ఉండే ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబిత చాలా పెద్దగానే ఉంది. తెలుగు.. హిందీతో పాటు ఇటీవల ఈమె తమిళంలో కూడా విజయ్‌ కు జోడీగా ఒక సినిమాలో నటించేందుకు సైన్‌ చేసింది. ఇంకా కొన్ని తమిళ సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. తెలుగులో ఈమెకు వస్తున్న ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న ఆఫర్లకు డైరెక్ట్‌ గా ఈమె నో చెప్పడం లేదట. కొన్ని సినిమాలకు పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేసి తప్పుకునే ప్రయత్నం చేస్తుందట.

పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేయడం వల్ల పూజా హెగ్డే ను కాదనుకుని మరో హీరోయిన్‌ తో కొందరు చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈమె మహేష్‌ బాబు తో త్రివిక్రమ్‌ చేయబోతున్న సినిమాకు ఓకే అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు పూజా హెగ్డే వీలు కల్పించుకుని మరీ డేట్లు ఇస్తుంది. కాని కొన్ని మీడియం బడ్జెట్‌ సినిమాల విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించకుండా పారితోషికంను భారీగా పెంచి చెబుతుందట. ఒకే సారి మూడు భాషల్లో అది కూడా వరుసగా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం పూజా హెగ్డేకే దక్కింది.

డిమాండ్‌ ఉంది కదా అని గట్టిగానే పారితోషికం డిమాండ్‌ చేస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం కమర్షియల్‌ సినిమాలకు పెద్ద దిక్కు అన్నట్లుగా టాలీవుడ్‌ లో మారిపోయింది. కమర్షియల్‌ సినిమాల్లో కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచితే సరిపోతుంది. నటన గురించి పెద్దగా పట్టించుకునే వారు ఉండరు. కనుక కొందరు హీరోయిన్స్‌ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి వారి కెరీర్‌ ఎంత కాలం ఇదే స్థాయిలో ఉంటుందో చెప్పలేం. గతంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇంతే బిజీగా సినిమాలు చేసిన విషయం అందరికి తెల్సిందే.