Begin typing your search above and press return to search.

దళపతి మూవీకి బుట్టబొమ్మ భారీ పారితోషికం..??

By:  Tupaki Desk   |   10 March 2021 1:30 AM GMT
దళపతి మూవీకి బుట్టబొమ్మ భారీ పారితోషికం..??
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమె చేతిలో భారీ సినిమాలు రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలు పూజా డిమాండ్ మరింత పెంచేశాయని చెప్పాలి. అలవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో భారీ సినిమాకు సంతకం చేసిందట. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కనున్న 65వ సినిమాలో పూజా ఛాన్స్ కొట్టేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు అమ్మడు దాదాపు 2.5 కోట్లు పారితోషికంగా తీసుకోబోతుందని టాక్.

పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న పూజాకు మేకర్స్ ఆ మాత్రం భారీ చెల్లింపులు అందించకపొతే ఎలా అంటూ సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయట. అలవైకుంఠపురంలో సక్సెస్ మీట్ సమయంలోనే పూజా మార్కెట్ వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా వేశారు డైరెక్టర్ త్రివిక్రమ్, అల్లు అర్జున్. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ రష్యా, చెన్నైలలో షూటింగ్ చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపాడు. అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ భారీ సినిమాలో హీరో శివకార్తికేయన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ రోల్ ప్లే చేయనున్నాడు. ప్రస్తుతం దళపతి విజయ్ మాస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తూ నెక్స్ట్ సినిమాకోసం రెడీ అవుతున్నాడు. జులైలో పూజా నటించిన రాధేశ్యామ్ విడుదల కాబోతుంది.