Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ కోసం బాలీవుడ్ షూట్ వాయిదానా?

By:  Tupaki Desk   |   27 Dec 2020 5:50 AM GMT
రాధేశ్యామ్ కోసం బాలీవుడ్ షూట్ వాయిదానా?
X
చాలామంది అందాల క‌థానాయిక‌లు బాలీవుడ్ లో సెటిలైతే సౌత్ గురించి ఆలోచించ‌రు. అక్క‌డ ఉన్న మత్తు గ‌మ్మ‌త్తు అలాంటిది. అయితే హిందీ పరిశ్ర‌మ‌లో ఏ క‌థానాయిక అయినా సుదీర్ఘ కాలం స్టార్ హీరోయిన్ గా వెల‌గాలంటే అంత సులువేమీ కాదు. ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ని ఎదుర్కొని నిల‌దొక్కుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇలాంటి ర‌క‌ర‌కాల ప‌రిమితుల న‌డుమ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటి నార్త్ కి వెళ్లే భామ‌లు ఉంటారు. కొంద‌రైతే ద‌క్షిణాది ఆడియెన్ ప్రేమ‌కు దాసులై ఇక్క‌డే సెటిల‌వుతుంటారు. ఆ కేట‌గిరీకే చెందుతుంది పూజా హెగ్డే. ఇక్క‌డ త‌న‌ని బుట్ట‌బొమ్మ అంటూ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు ఫ్యాన్స్. అలాంట‌ప్పుడు బాలీవుడ్ కోసం తెలుగు సినిమాల్ని వ‌దులుకునే ఛాన్సుందా? అంటే స‌సేమిరా అనేస్తోంది. అందుకు పూజా డేరింగ్ డెసిష‌నే తాజా ఎగ్జాంపుల్.

డార్లింగ్ `రాధేశ్యామ్` షూట్ కోసం ఏకంగా రోహిత్ శెట్టి - ర‌ణ‌వీర్ సింగ్ ప్రాజెక్ట్ షెడ్యూళ్ల‌నే ఛేంజ్ చేయాల్సిందిగా పూజా అభ్య‌ర్థించ‌డం ఆస‌క్తిక‌రం. తెలుగు చిత్ర పరిశ్రమపై తనకున్న ప్రేమను గౌరవాన్ని ప్రదర్శిస్తూ త‌దుప‌రి బాలీవుడ్ ప్రాజెక్ట్ షూట్ ను వాయిదా వేయాల్సిందిగా కోరింద‌ట‌. ప్రస్తుతం ప్రభాస్ `రాధే శ్యామ్` చేస్తున్న పూజా హెగ్డే ... రణవీర్ - రోహిత్ శెట్టి త‌దుప‌రి చిత్రం `సర్కస్` షూటింగ్ ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు.

రాధే శ్యామ్ తాజా షెడ్యూల్ భారీ సెట్ లో తెర‌కెక్క‌నుంది. ఇప్ప‌టికే సెట్ రెడీ అయ్యింది. పూజా మినహా న‌టీనటుల సాంకేతిక నిపుణుల తేదీలు లాక్ చేసేశారు.

చిత్రీక‌ర‌ణ వాయిదా వేయ‌డం అంటే అది కాస్ట్ ఫ్యాక్ట‌ర్. అది ఎంత ఖరీదైన వ్యవహారం అవుతుందో అంద‌రికీ తెలిసిన వ్య‌వ‌హార‌మే. అయితే సానుకూలంగా పరిస్థితిని అర్థం చేసుకున్న సర్కస్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పూజా హెగ్డే కోరిక‌ను మ‌న్నించి రాధేశ్యామ్ షెడ్యూల్ పూర్త‌య్యేవ‌ర‌కూ వేచి చూసేందుకు అంగీక‌రించార‌ట‌.