Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌కు ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అఖిల్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు?

By:  Tupaki Desk   |   13 Oct 2020 3:20 PM IST
బుట్ట‌బొమ్మ‌కు ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అఖిల్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు?
X
ఈరోజు బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న బుట్ట‌బొమ్మ‌కు అరుదైన కానుక‌లు అందాయి. అందులో ఒక‌టి డార్లింగ్ ప్ర‌భాస్ ఇచ్చిన‌ది. ఇంకొక‌టి అక్కినేని చియాన్ అఖిల్ ఇచ్చిన‌ది. ఈ రెండు కానుక‌ల‌కు ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోతోంది పూజా హెగ్డే.

ఇంత‌కుముందే రిలీజ్ చేసిన `రాధేశ్యామ్` ప్రేర‌ణ ఇంట్ర‌డ‌క్ష‌న్ లుక్ ఇప్ప‌టికే అంత‌ర్జాలాన్ని షేక్ చేసింది. జాతీయ మీడియాలోనూ ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. తాజాగా అఖిల్ స‌ర‌స‌న న‌టిస్తున్న పోస్ట‌ర్ రిలీజైంది. పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (MEB) నుండి ఈ పోస్ట‌ర్ ని ఆవిష్కరించారు.

ఇది ఫస్ట్ లుక్ కానప్పటికీ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. హ్యాపీ బ‌ర్త్ డే పూజా హెగ్డే అంటూ కాలేజ్ గోయింగ్ గాళ్ లుక్ ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తికరం. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్లో పూజా విద్యార్థిగా క‌నిపించ‌నుంది. చినుగుల‌ డెనిమ్ టీ టాప్ లో అద‌ర‌గొడుతోంది. అఖిల్ తో రొమాన్స్ ఏ రేంజులో ఉంటుందోన‌ని యూత్ ఒక‌టే ఊహించేసుకుంటున్నారు మ‌రి.

ఇక ఈ చిత్రంతో దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తిరిగి స‌త్తా ఆటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. లాక్ డౌన్ అనంత‌రం గత నెలలో దాని షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.డిసెంబర్ విడుదలను లక్ష్యంగా పెట్టుకుని పూర్తి చేస్తున్నార‌ట‌. గోపి సుందర్ సంగీతం అస్సెట్ కానుంది. GA2 పిక్చర్స్ - అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.