Begin typing your search above and press return to search.

ఇప్పుడు టాప్ 3 వీళ్లేనా?

By:  Tupaki Desk   |   27 April 2018 10:29 AM IST
ఇప్పుడు టాప్ 3 వీళ్లేనా?
X
గత కొంత కాలంగా టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ హవా ఎక్కువగా కొనసాగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించిన వాళ్లే మళ్లీ మళ్లీ నటించారు. కాజల్ - తమన్నా అలాగే సమంత వంటి హీరోయిన్స్ దాదాపు స్టార్ హీరోలందరితో నటించారు. ప్రస్తుతం కూడా అడపాదడపా నటించేస్తున్నారు. అయితే వారికి పోటీని ఇచ్చే కథానాయికలు ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అనుష్క లాంటి హీరోయిన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అయినా ఆమె అందరితో నటించే అవకాశం లేదు. దీంతో దాదాపు చాలా మందికి పెద్ద సినిమాల్లో అవకాశాలు దగ్గడంతో కొంత మంది సీనియర్ హీరోయిన్స్ ఫెడవుట్ అయిపోతున్నారు. వారికి పోటీగా పూజ హెగ్దే - అను ఇమ్మాన్యుయేల్ మరియు కైరా అద్వానీ లాంటి హీరోయిన్స్ రంగంలోకి దిగారు. గత ఏడాది వరకు కొంచెం స్లోగా వచ్చిన పూజ దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో క్రేజ్ అందుకొని వరుస ఆఫర్స్ అందుకుంటోంది.

అలాగే మన హీరోల టేస్ట్ కూడా మారింది. నటించిన హీరోయిన్స్ తోనే ఎన్ని సార్లు నటించాలి అని కొత్త భామలతో జతకడుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే పాత హీరోయిన్స్ ఫెడవుట్ అయ్యారనే చెప్పాలి. అను ఇమ్మాన్యుయేల్ కూడా స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఆమె వయసు కూడా 21 కావడంతో రానున్న రోజుల్లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. కైరా అద్వానీ శ్రద్దా కపూర్ లాంటి వారు నార్త్ నుంచి సౌత్ కి షిఫ్ట్ అవ్వడంతో పోటీ ఎక్కువైంది. మరి ఈ రణరంగంలో సీనియర్ కథానాయికల కెరీర్ క్లోజ్ అయినట్టేనా అనే ప్రశ్నకు సమాధానం దగ్గర్లోనే ఉందనే టాక్ వస్తోంది.