Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే.. మరో ఐటెమ్ సాంగ్?

By:  Tupaki Desk   |   30 May 2022 7:40 AM GMT
పూజా హెగ్డే.. మరో ఐటెమ్ సాంగ్?
X
ఇటీవల కాలంలో గ్లామరస్ హీరోయిన్స్ ఎక్కువగా రెగ్యులర్ సినిమాల కంటే కూడా స్పెషల్ ఐటెం సాంగ్స్ తోనే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీలలోంపూజా హెగ్డే ఏ స్టేజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ బుట్ట బొమ్మ ఎలాంటి సినిమా పట్టుకున్నా కూడా ఆదాయపరంగా మంచి లాభాలను అందిస్తుంది. వరుసగా బీస్ట్, ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలు తేడా కొట్టినప్పటికీ కూడా అమ్మడి రేంజ్ అయితే కొంచెం కూడా తగ్గలేదు.

చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే స్పెషల్ సాంగ్స్ తో కూడా పూజా ప్రస్తుతం భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుమతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కామెడీ ఫిలిమ్ F3 లో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాట కోసం ఏకంగా కోటి వరకు పారితోషికం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమాలకు రెండు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ కేవలం ఒకే ఒక్క పాట కోసం ఆ స్థాయిలో అందుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇక త్వరలోనే మరొక ప్రత్యేకమైన పాటలో కూడా పూజా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టాలెంటెడ్ నటుడు రణ్ బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాట హైలెట్ గా ఉంటుందట.

అయితే ఆ పాటకోసం పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే స్పెషల్ సాంగ్ కోసం కోటి వరకు డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ ఆ ప్రత్యేకమైన పాట కోసం ఇంకాస్త ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే లిస్టులో మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి ఈ బ్యూటీ రానున్న రోజుల్లో తన పారితోషికాన్ని ఇంకా ఏ లెవల్ కు పెంచుతుందో చూడాలి.