Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం పూజా తిప్పలు

By:  Tupaki Desk   |   6 May 2018 8:19 AM GMT
ఎన్టీఆర్ కోసం పూజా తిప్పలు
X
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలో పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ యమా ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుంటున్న ఈ మూవీలో పాటల చిత్రీకరణ వచ్చే నెల నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాని పూజా హెగ్డే మాత్రం టెన్షన్ తో ఉంది. కారణం ఎన్టీఆర్ మామూలుగా కాస్త బొద్దుగా ఉన్నప్పుడే స్టెప్స్ తో చెడుగుడు ఆడతాడు. అలాంటిది ఇప్పుడు ఇంత స్లిమ్ గా మారాక ఊరికే ఉంటాడా. సో తనతో ధీటుగా పూజా కూడా డాన్స్ చేస్తేనే స్క్రీన్ మీద పండుతుంది. లేదా పూజా ఒక్కర్తే తేలిపోతుంది. అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీసు మొదలు పెట్టిందని టాక్. కాని పూజాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. లాస్ట్ ఇయర్ డిజేలో అల్లు అర్జున్ తో ఈ మధ్యే వచ్చిన రామ్ చరణ్ రంగస్థలంలో ఇద్దరితో క్లిష్టమైన స్టెప్స్ వేయటంలో ఇప్పటికే ఒక రౌండ్ ప్రాక్టీసు అయ్యింది కాబట్టి తనకు ఎన్టీఆర్ సినిమా సులభం అవుతుంది.

పూజా హెగ్డే ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దీనితో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25 మూవీ కూడా సైన్ చేసిన పూజా ప్రభాస్ నటించే జిల్ దర్శకుడు రాధాకృష్ణ కొత్త సినిమాలో కూడా ఎంపికైనట్టు సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన సాక్ష్యం వచ్చే నెల విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ పక్కన ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డేకు ఇన్నేళ్ళ తర్వాత కోరుకున్న బ్రేక్ దొరికింది. హిట్టా ఫ్లాపా పక్కన పెడితే పూజా హెగ్డే ఇప్పటి దాకా రెండు బాషలలో మోస్ట్ క్రేజీ స్టార్ హీరోస్ పక్కన నటించడం విశేషం. హిందిలో హృతిక్ రోషన్ తో చేసిన మొహెంజోదారో డిజాస్టర్ అయ్యాకే డిజే ఛాన్స్ వచ్చింది. ఇక అక్కడి నుంది తన జాతకమే మారిపోయింది. తారక్ పక్కన పూజా వేయబోయే స్టెప్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకోవాలి అంటే మాత్రం కొన్ని నెలలు ఆగక తప్పదు.