Begin typing your search above and press return to search.

ప్రధానికే సలహా ఇస్తున్న బన్నీ హీరోయిన్

By:  Tupaki Desk   |   12 Nov 2016 9:33 AM GMT
ప్రధానికే సలహా ఇస్తున్న బన్నీ హీరోయిన్
X
ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ఒకటే టాపిక్.. పెద్ద నోట్లు రద్దు వ్యవహారం. ప్రతీ ఒక్కరి మీదా డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తుండడంతో.. హాట్ హాట్ గా ఇష్యూ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా బ్లాక్ మనీని అంతం చేయడం.. దొంగ నోట్లకు చెక్ పెట్టే లక్ష్యంతో చేపట్టిన ఈ చర్యకు.. సినిమా వాళ్ల నుంచి సపోర్ట్ బాగానే వస్తోంది.

ఓ హీరోయిన్ అయితే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే ఒక సలహా ఇచ్చేస్తోంది. అల్లు అర్జున్ తో కలిసి డీజే- దువ్వాడ జగన్నాధంలో ఆడి పాడుతోన్న పూజా హెగ్డే.. 500..100 నోట్లపై మోడీకి ఓ ట్వీట్ పెట్టింది. 'నరేంద్ర మోడీ గారూ.. ఒకవేళ 500&1000 రూపాయల నోట్లను 2017 మార్చ్ 31వరకూ ప్రభుత్వ ఆసుపత్రులు డొనేషన్లుగా స్వీకరించే ఏర్పాటు ఉంటే.. నల్లధనం ఓ మంచి పనికి ఉపయోగపడినట్లు అవుతుంది. రద్దు కారణంగా చెల్లకుండా పోయే నల్లధనం ఇలా ఉపయోగపడుతుంది కదా. ప్రజలు డొనేట్ చేస్తే.. ఆరోగ్య రంగం కూడా పెరుగుతుంది. కేవలం ఓ సలహా మాత్రమే' అంటూ ట్వీట్ చేసింది పూజా హెగ్డే.

గవర్నమెంట్ ఆస్పత్రుల్లో 500.. 1000 నోట్లను తీసుకుంటున్నారు కానీ.. ఈమె చెప్పిన సంగతి ఏంటంటే.. వాటికి విరాళాలు స్వీకరించే ఆప్షన్ ఉండాలట. సలహా బాగానే ఉంది. మరి మోడీ స్పందన ఎలా ఉంటుందో.. అసలు పట్టించుకుంటారో లేదో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/