Begin typing your search above and press return to search.

మ‌రో స్టార్ కిడ్ డెబ్యూ రేస్‌ లో

By:  Tupaki Desk   |   19 Nov 2018 7:51 AM GMT
మ‌రో స్టార్ కిడ్ డెబ్యూ రేస్‌ లో
X
వార‌స‌త్వ న‌టుల వెల్లువ (నెప్టోయిజం)పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న వేళ .. వారసుల రాక త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా.. అంత‌కంత‌కు పెరుగుతోంది. కంగ‌న ఫైరింగ్‌తో ఆలియా చిన్న బుచ్చుకున్నా, సోన‌మ్, సోనాక్షి అల‌క‌బూనినా.. జ‌రిగేది జ‌ర‌గ‌కుండా ఆగ‌డం లేదు. బాల‌వుడ్‌లో వార‌స హీరోల రాక కంటే, వార‌సురాళ్ల వెల్లువ ఓ రేంజులో ఉంది. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది వార‌స‌త్వ క‌థానాయిక‌లు బ‌రిలో ఉన్నారు. శ్రీ‌దేవి కూతురు జాన్వీ ఇప్ప‌టికే క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ సోద‌రి ఖుషీ బ‌రిలోకి దిగే ప్లాన్‌ లో ఉంది. చుంకీ పాండే కూతురు అహ‌నా పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 చిత్రంతో బ‌రిలో దిగుతోంది. అదే చిత్రంతో వేరొక అంద‌గ‌త్తె తారా సుతారియా బ‌రిలో దిగుతోంది.

సైఫ్ డాట‌ర్ సారా అలీఖాన్ కేదార్‌ నాథ్ - సింబా చిత్రాల‌తో ఘ‌న‌మైన ఎంట్రీని చాటుకుంటోంది. ఇక కింగ్ ఖాన్ షారూక్ కుమార్తె సారా అలీఖాన్ తెరంగేట్రానికి ఇంకెంతో స‌మ‌యం లేదు. ఖాన్ సాబ్ జేగంట మోగించేశారు. వీళ్లంద‌రితో పాటు వేరొక కొత్త భామ బ‌రిలో ఉందిప్పుడు. 80ల నాటి గ్లామ‌ర్ క్వీన్ పూజా బేడి కుమార్తె ఆలియా ఫ‌ర్నిట‌ర్‌వాలా డెబ్యూగా బ‌రిలో దిగుతోంది. పేరుకు త‌గ్గ‌ట్టే ఈ టీనేజీ భామ‌లో ఒగ‌లు గిగ‌లు ఓ రేంజులోనే క‌నిపిస్తున్నాయ్.

ప్ర‌ఖ్యాత ఫిలింఫేర్ అందించిన క‌థ‌నం ప్ర‌కారం.. పూజా బేడి త‌న కుమార్తె తెరంగేట్రానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా టైటిల్ `జవానీ జానెమ‌న్`. ఇక ఈ చిత్రం ఓ 40ఏళ్ల న‌డివ‌య‌స్కుడికి, అత‌డి టీనేజీ డాట‌ర్‌ కు మధ్య అనుబంధం నేప‌థ్యంలో క‌థాంశం ఉంటుందిట‌. తండ్రి కూతుళ్ల మ‌ధ్య డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో సైఫ్ అలీఖాన్ డాడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ కొత్త‌ ఆలియా రేంజు ఎంత? అంటే ఆ పాత ఆలియా రేంజును మించి అన్న చందంగా ట్విట్ట‌ర్ - ఇన్‌ స్టాలో ఫోటోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మామ్ పూజా బేడీని మించి ఆలియా చెల‌రేగుతుంద‌నే అర్థ‌మ‌వుతోంది.