Begin typing your search above and press return to search.

45 ఏజ్ లో బికినీల‌తో షేక్ చేస్తున్న బాత్రా

By:  Tupaki Desk   |   26 March 2021 1:30 PM GMT
45 ఏజ్ లో బికినీల‌తో షేక్ చేస్తున్న బాత్రా
X
45 వ‌య‌సులో వేడెక్కించే అందాల‌తో ఆక‌ట్టుకుంటోంది పూజా బాత్రా. లేటు వ‌య‌సు ఘాటు అందాల‌తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ హుషారు చూస్తుంటే వెండితెర రీఎంట్రీకి సిద్ధ‌మ‌వుతోందా? అన్న సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. మాజీ మిస్ ఇండియా .. న‌టి కం మోడ‌ల్ పూజా బాత్రా రీఎంట్రీ ప్లాన్ గురించి ఎలాంటి స‌మాచారం అయితే లేదు కానీ.. ఇటీవ‌ల సోషల్ మీడియాల్లో అభిమానులను నిరంత‌ర ఎంట‌ర్ టైన్ చేస్తూనే ఉన్నారు.

తరచూ తన ఫాలోవ‌ర్స్ కోసం వేడెక్కించే ఫోటో.. వీడియో ట్రీట్ ని అందిస్తోంది. తాజాగా తన ఇన్ లో పూజా రెడ్ హాట్ బికినీ ఫోటోల‌తో విరుచుకుప‌డింది. పూజా ఒక పడవలో కెమెరాకు ఫోజులిస్తున్న ఫోటోల బంచ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. అలాగే పూజా రెడ్ టాప్ .. ప‌రికిణీలో ఉన్న వేరొక ఫోటోషూట్ అంతే వైర‌ల్ గా మారింది. త‌న‌ అంద‌మైన క‌ళ్లు.. వ్యక్తీకరణ ఆ చిరునవ్వు మంత్ర‌ముగ్ధం చేస్తున్నాయి. `సెయిలింగ్ అవే .. గోవా` అన్న వ్యాఖ్య‌ను ఈ ఫోటోషూట్ కి జోడించారు.

టాలీవుడ్ లో దాస‌రి నారాయ‌ణ‌రావు వార‌సుడు దాస‌రి అరుణ్ కుమార్ స‌ర‌స‌న గ్రీకువీరుడు అనే చిత్రంలో న‌టించిన పూజా బాత్రా ఆ త‌ర్వాత బాలీవుడ్ కే అంకిత‌మైంది. త‌మిళం మ‌ల‌యాళంలో ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించింది.