Begin typing your search above and press return to search.

గ్రీకు వీరుడు బ్యూటీ.. బాగా హాటీ

By:  Tupaki Desk   |   4 Dec 2016 1:30 PM GMT
గ్రీకు వీరుడు బ్యూటీ.. బాగా హాటీ
X
అఖిల్ చిన్నోడిగా కనీసం ఊహ కూడా తెలియని వయసులో సిసింధ్రి మూవీలో నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆడి పాడింది పూజా బత్రా. ఆ తర్వాత గ్రీకువీరుడు మూవీలో దాసరి అరుణ్ కుమార్ కి జోడీగా కూడా నటించింది. నెక్ట్స్ తెలుగు సినిమాలేవీ చేయలేదు కానీ.. హిందీలో మాత్రం వరుసగా మూవీస్ చేస్తూనే ఉంది. 2002లో ఓ కేలిఫోర్నియా వ్యక్తిని పెళ్లి చేసుకుని.. 8 ఏళ్లకు విడాకులు ఇచ్చేసింది. అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూనే ఉంది.

సినిమాల సంఖ్య అయితే తక్కువగా ఉంటుంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు బాగా దగ్గర పూజా బత్రా. 40 ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా టూపీస్ బికినీల్లో రచ్చ చేసేస్తూ ఉంటుంది. అంతే కాదు.. మైక్రో బికినీలు వేయడంలో కూడా పూజాకు ఎవరూ సాటి రాలేదు. కాసింత కవరింగ్ ఇస్తూ.. తన దేహాన్ని ఇంకా పబ్లిక్ షో పెట్టేస్తూ ఉంటుంది.

ఈ ఏజ్ లోనూ ఇంత ఫిట్ గా ఉన్న పూజా బత్రా.. ఇప్పుడు బాలీవుడ్ లో రీఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్యూటీ చివరగా ఏబీసీడీ2లో కనిపించింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. మరి అమ్మడు కోరుకునే ఆ అసలైన బ్రేక్ ని ఇచ్చే మేకర్ ఎవరో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/