Begin typing your search above and press return to search.

వీడియో : అలవైకుంఠపురంలో పూజ అర్హ డాన్స్

By:  Tupaki Desk   |   13 Jan 2022 8:30 AM GMT
వీడియో :  అలవైకుంఠపురంలో పూజ అర్హ డాన్స్
X
అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురంలో సినిమా విడుదల అయి రెండు సంవత్సరాలయింది. సంక్రాంతి కానుకగా 2020 సంవత్సరంలో విడుదలైన అలవైకుంఠపురంలో చిత్రం కు రెండు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పూజా హెగ్డే ఆసక్తికర ఒక వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో లో పూజా హెగ్డే మరియు అల్లు అర్హ లు అదే సినిమాలోని సాంగ్ కి కూర్చుని డ్యాన్స్ చేశారు. అర్హ ఆ వీడియోలో చాలా చిన్నగా క్యూట్ గా కనిపిస్తుంది. అర్హ ఎంత క్యూట్ గా ఉందో అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పూజ హెగ్డే చెప్పిన విధంగా చాలా క్యూట్ స్టెప్పులతో అర్హ ఆకట్టుకుంటుందని వీడియో కి నెటిజన్స్ కితాబిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో అర్హ ప్రతి ఒక్క వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఈ పాత వీడియో ని కూడా జనాలు తెగ ఆదరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారాలపట్టి అయినా అల్లు అర్హ ఎప్పుడూ కూడా తన క్యూట్ ముచ్చట్లతో కట్టుకుంటుంది. రెండేళ్ల క్రితం అల వైకుంఠపురం లో షూటింగ్ సందర్భంలోనే పూజా హెగ్డే తో ఇలా సందడి చేసి అనిపించింది. అల వైకుంఠపురంలో సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన పూజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తెలుగులో ఈమె నటించిన రాధేశ్యాం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.

ఇక తమిళంలో కూడా సూపర్ స్టార్ విజయ్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే మొత్తంగా పూజ కెరియర్లో చాలా బిజీగా ఉంది. అల వైకుంఠపురంలో సినిమా విషయానికి వస్తే 2020 సంవత్సరం లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత కరోన కారణంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించింది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ మనుగడ సాధ్యం కావడం లేదు. అల్లు అర్జున్ కి మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చిత్రంగా అల వైకుంఠపురంలో నిలిచింది అనడంలో సందేహంలేదు. నాన్ బాహుబలి రికార్డ్స్ అల వైకుంఠపురంలో దక్కించుకుంది. సినిమా కు తమన్ సంగీతాన్ని అందించాడు. ఆ పాటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.